అల్లు శిరీష్ నయనికల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో శిరీష్ నయనిక ఉంగరాలు మార్చుకున్నారు.
నయనిక మన హైదరాబాద్ అమ్మాయే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఆమె ప్రసిద్ధ వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది.
సౌత్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ ఫ్యామిలీలోకి అడుగు పెడుతున్నా కూడా..
ఆమె పబ్లిక్ అటెన్షన్‌కి దూరంగానే ఉంది. చాలా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడింది.
శిరీష్, నయనిక చాలా సంవత్సరాలుగా స్టెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
నెల రోజుల క్రితం శిరీష్ తనకు కాబోయే భార్యతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోను షేర్ చేశారు.
నయనికతో ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు చెప్పారు. ఇరు కుటుంబాలు తమ ప్రేమను స్వీకరించినట్లు వెల్లడించారు.