అనసూయ భరద్వాజ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌, వ్యక్తిగత అభిప్రాయాలపై విమర్శలు, కామెంట్లు కొత్తవి కావు.

అయితే తాజాగా మరోసారి అనసూయ పేరు వైరల్ అవడానికి కారణం… ఆమె తన పెద్ద కొడుకు చేసిన కామెంట్లపై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మళ్లీ బయటకు రావడమే

అనసూయ స్వయంగా చెప్పిన ప్రకారం.. ఆమె వేసుకునే బట్టలపై ఆమె పెద్ద కొడుకు ఓపెన్‌గా అభిప్రాయం వ్యక్తం చేసేవాడట. ముఖ్యంగా పొట్టి బట్టలు, క్రాప్ టాప్‌ల విషయంలో అతడికి అభ్యంతరం ఉండేదట. 

“మమ్మీ ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు” అని నేరుగా ప్రశ్నించేవాడట. కొన్ని సందర్భాల్లో అయితే, తనకు నచ్చలేదని మొహం మీదే చెప్పేవాడట. 

ఒకరోజు అనసూయ క్రాప్ టాప్ వేసుకుంటే “మమ్మీ అది కింద వరకు వేసుకో” అని సూచించాడట. అంతేకాదు “ఈ డ్రెస్ నాకు నచ్చలేదు మమ్మీ” అంటూ చాలా సార్లు ఓపెన్‌గా కామెంట్ చేశాడని అనసూయ చెప్పింది.

ఇలాంటి మాటలు కొడుకే అన్నాడంటే ఏ తల్లికైనా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ అనసూయ మాత్రం దీనిని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా హ్యాండిల్ చేసిందట. 

మొదట కొడుక్కి శాంతంగా, అర్థమయ్యేలా చెప్పిందట. తన బట్టలు తనకు కంఫర్ట్‌గా ఉండేలా వేసుకుంటానని.. ఇందులో తప్పేమీ లేదని వివరించిందట. 

అయినా సరే అతను పదే పదే అదే విషయం మీద అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఈ సారి కాస్త సీరియస్‌గా మాట్లాడిందట. అనసూయ కొడుక్కి ఇచ్చిన కౌంటర్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.