Tooltip

ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం, నచ్చిన విధంగా ఉండటం, ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవడం అనసూయ నైజం.

Tooltip

అయితే ఆమె పెళ్లై ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో అనసూయపై ట్రోల్స్ నడుస్తుంటాయి.

Tooltip

కొందరైతే అనసూయ భర్తను కూడా ఘోరంగా కామెంట్స్ చేస్తూ దుమారం రేపిన సందర్భాలు చూసే ఉన్నాం.

Tooltip

అనసూయ తీరు చూసి ఆమె భర్తపై జాలి పడేవారు, ఆయన్ను తిట్టేవారు లేకపోలేదు.

Tooltip

అనసూయ ఏం చేసినా ఆమె భర్త అడ్డుచెప్పడు.. ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట, భలే నమ్ముతాడురా బాబూ అనే వారిని చూశాం.

Tooltip

కాకపోతే అందరు మగాళ్ల లాంటివాడే నా భర్త కూడా అంటోంది అనసూయ.

Tooltip

సాధారణంగా “మా ఆయన పర్‌ఫెక్ట్” అని అంతా అనుకుంటారని, కానీ వాస్తవానికి ఆయన కూడా మిగతా మగాళ్ల లాగే అనేసింది.

Tooltip

నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నేను చాలా మందిని కలవాల్సి వస్తుంది. కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకి నచ్చని సందర్భాలు ఉన్నాయి.

Tooltip

అప్పుడు మా ఆయనకి అసహనం వేసేది. నేను హీరోలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన అసౌకర్యంగా ఫీల్ అయ్యేవారు.

Tooltip

మా మధ్య గొడవలు కూడా జరిగాయి. నన్ను ఫ్లర్ట్ చేయడం, కామెంట్స్ చేయడం చూసినప్పుడు ఆయనకి ఇబ్బంది. 

Tooltip

అందరూ అనసూయ భర్త అన్నీ ఒప్పుకుంటాడు అనుకుంటారు.. వాడు చేతకాని వాడు అనేవాళ్లూ ఉన్నారు.

Tooltip

అయితే అదృష్టం ఏమంటే మా ఆయనకి తెలుగు రాదు. సో.. సోషల్ మీడియాలో ఎవరేం రాస్తున్నారో పట్టించుకోడు. అని అనసూయ చెప్పింది.