నెయ్యిని మనమంతా ఆరోగ్యకరమైనది అని భావిస్తాం. ఈ నెయిల్లో కూడా ఆవు నెయ్యి, గేదె నెయ్యి అనే రెండు ప్రధాన రకాలున్నాయి.

రెండింటిలోనూ పోషకాలు, ఆయుర్వేద ప్రాముఖ్యాలు ఉన్నాయి. ఆవు నెయ్యి సాత్విక గుణాలతో ఉంటూ.. జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

గేదె నెయ్యి తామసిక గుణాలతో ఉంటూ.. ఎనర్జీని ఇస్తుంది.రెండు నెయ్యిల మధ్య మొదటి తేడా రంగులో కనిపిస్తుంది.

ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఇది కళ్ళు, చర్మానికి మంచిది.

గేదె నెయ్యి తెలుపు లేదా పాలిష్ క్రీమ్ రంగులో, కొన్ని సందర్భాల్లో బ్రౌన్ షేడ్‌లో కనిపిస్తుంది. టెక్స్చర్ విషయంలో, ఆవు నెయ్యి తేలికగా, త్వరగా కరిగి జీర్ణమవుతుంది.

గేదె నెయ్యి మందంగా, దట్టంగా ఉంటుంది. కరగాలంటే 38.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. అందుకే.. 

త్వరగా వండే వంటలు, స్వీట్లకు ఆవు నెయ్యి మేలు.. డీప్ ఫ్రై వంటలకు గేదె నెయ్యి మేలు.

పోషకాల విషయంలో, రెండూ 98.9శాతం లిపిడ్స్‌తో సమానమైన కేలరీలు ఇస్తాయి. కానీ గేదె నెయ్యిలో కొవ్వు శాతం ఎక్కువ.

అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. మన శరీరంలో ఈ కొవ్వు ఎక్కువైతే, అది చెడు కొలెస్ట్రాల్ (LDL) అవ్వగలదు.

మొత్తంగా, ఆవు నెయ్యి.. జీర్ణక్రియ పెరగాలి అనుకునేవారికీ, బరువు తగ్గాలనుకునేవారికి మేలు.

ఎనర్జీ పెరగాలి, ఎముకలు బలంగా ఉండాలి అనుకునేవారికి గేదె నెయ్యి మేలు. కానీ ఏ నెయ్యి అయినా మితంగా వాడాలి.