రోజూ పొద్దున్నే వేడి వేడిగా ఒక కప్పు కాఫీ పడందే చాలామందికి రోజు మొదలవ్వదు. టైమింగ్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగడం చాలామందికి అలవాటు.

ఆ ఒక్క సిప్ ఇచ్చే 'కిక్' అలాంటిది మరి. అయితే కాఫీ లిమిట్ దాటి తాగితే అది విషంలా మారుతుందట. అసలు లిమిట్ ఎంత? అనే విషయాలు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక హెల్తీ అడల్ట్/ ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి అత్యంత మంచిదని నిపుణులు చెబుతున్నారు..

ఒక మనిషి రోజుకు గరిష్టంగా 400 మిల్లీగ్రాముల కెఫిన్ వరకు తీసుకోవచ్చు. అంటే 4 కప్పుల వరకు సేఫ్. కానీ, కాఫీ బెనిఫిట్స్ పూర్తిగా అందాలంటే మాత్రం రోజుకు రెండు కప్పుల దగ్గర ఆగడమే మంచిది.

రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల కేవలం నిద్ర మత్తు వదలడమే కాదు, అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం మన బాడీకి మంచి బూస్ట్ ఇవ్వడంతో పాటు..

టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తాయి. ఇది లివర్ పనితీరును, మెటబాలిజంని మెరుగుపరచడమే కాకుండా.. బ్రెయిన్‌ను అలర్ట్‌గా ఉంచుతూ మూడ్ కూడా ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.

ఎంత తాగుతున్నాం అనేదే కాదు, ఎప్పుడు తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్ ఉదయం లేదా మధ్యాహ్నం 4 గంటల లోపు మాత్రమే. ఎందుకంటే కెఫిన్ ప్రభావం మన బాడీలో 12 నుంచి 14 గంటల పాటు ఉంటుంది.

కాఫీ ఎంత మంచిదైనా రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ (400mg పైన) తాగితే లాభాల బదులు నష్టాలే ఎక్కువ. లిమిట్ దాటితే విపరీతమైన ఆందోళన, చిరాకు, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం.

గుండె వేగం పెరగడం, హై బీపీ వంటి ఫిజికల్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అందుకే ముఖ్యంగా గుండె జబ్బులు లేదా బీపీ ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, డాక్టర్ సలహా మేరకు తగ్గించి తాగడమే మంచిది.