పవన్ కళ్యాణ్ ఇంకా ఇండస్ట్రీలో స్టార్ అవ్వకముందు మాట ఇది. 1990ల మధ్యలో పవన్  వైజాగ్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు నందినితో పరిచయం ఏర్పడింది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి అది. 1997లో హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అప్పటికి పవన్ వయసు 26 అయితే, నందిని వయసు జస్ట్ 19. 

అప్పట్లో పవన్ ఇంకా హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి, మీడియా హడావిడి లేకుండా వీరి జీవితం ప్రశాంతంగానే మొదలైంది. పెళ్లైన రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉండటం స్టార్ట్ చేశారు.

అదే సమయంలో పవన్ కెరీర్ పీక్స్‌కి వెళ్లింది. 'బద్రి', 'జానీ' సినిమాల టైమ్‌లో హీరోయిన్ రేణు దేశాయ్‌తో పరిచయం కావడం, అది ప్రేమగా మారి సహజీవనం వైపు దారితీయడం చకచకా జరిగిపోయాయి.

అప్పటికి ఇంకా నందినితో పవన్‌కు లీగల్‌గా విడాకులు రాలేదు. 2007లో కోర్టు మెట్లు ఎక్కిన నందిని.. అప్పటివరకు గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం 2007లో ఒక్కసారిగా గుప్పుమంది.

తనకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే రేణు దేశాయ్‌ను పవన్ పెళ్లి చేసుకున్నాడని, ఇది చట్టరీత్యా నేరమని ఆరోపిస్తూ నందిని వైజాగ్ కోర్టులో కేసు వేసింది.

ఆ తర్వాత పవన్ విడాకులకు అప్లై చేశాడు. 2008లో కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. సెటిల్‌మెంట్ కింద పవన్ అప్పట్లోనే దాదాపు రూ.5 కోట్లు భరణంగా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి

లీగల్ గొడవలు ముగిశాక నందిని పూర్తిగా సైలెంట్ అయిపోయింది. రేణు దేశాయ్ లాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం గానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయలేదు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

ఇప్పుడు ఆమె పేరు..? మరి ఇన్నేళ్లుగా నందిని ఎక్కడుంది? ఏం చేస్తోంది? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విడాకుల తర్వాత ఆమె ఇండియా వదిలి అమెరికా వెళ్లిపోయింది.

గతాన్ని పూర్తిగా మర్చిపోయి, అక్కడ ఓ ఎన్నారై (NRI) డాక్టర్‌ను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. తన పేరును కూడా 'జాహ్నవి'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.