మనుషులకు ఎప్పుడు తుమ్ము వస్తుందో, ఎప్పుడు రాదో చెప్పడం కష్టం. వరైనా అనుకోకుండా తుమ్మితే, మనం చాలా తేలికగా 'God Bless You' అని అంటాం
దాదాపు 99 శాతం మందికి దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిసి ఉండదు. దీనికి అనేక ఆసక్తికరమైన చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి.
ప్లేగు మహమ్మారి: 'God Bless You' అనే పద్ధతి ప్రారంభం కావడానికి బలమైన చారిత్రక కారణం రోమన్ దేశంలో విస్తరించిన బ్యూబోనిక్ ప్లేగు మహమ్మారి.
ఒకప్పుడు రోమ్ దేశంలో ఈ భయంకరమైన వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి ప్రాథమిక లక్షణాలు తుమ్మడం, దగ్గడం. ఎవరైనా తుమ్మినప్పుడు, వారికి ప్లేగు సోకిందనే భయంతో,
అప్పటి పోప్ గ్రెగరీ మరణం నుంచి వారిని రక్షించాలనే ఉద్దేశంతో 'God Bless You' అని చెప్పేవారు. పోప్ చెప్పడం చూసి ఇతరులు ఈ ఆచారాన్ని పాటించడం మొదలుపెట్టారు.
మరో యూరోపియన్ నమ్మకం ప్రకారం, ఎవరైనా బలంగా తుమ్మినప్పుడు, ఆ సమయంలో గుండె ఒక్కక్షణం ఆగిపోతుందని, లేదా హృదయ స్పందనలో లోపం వస్తుందని భావించేవారు.
కొంతమంది ప్రాచీన సమాజాలలో, తుమ్మిన తర్వాత ఆ వ్యక్తికి మరణం రాకుండా, లేదా వారికి ఆపద కలగకుండా ఉండటానికి 'God Bless You' అని చెప్పడం ద్వారా రక్షించవచ్చని నమ్మేవారు.
మరో ఆసక్తికరమైన నమ్మకం ఏమిటంటే, ఒక వ్యక్తి తుమ్మినప్పుడు వారి శరీరంలో ఉన్న చెడు ఆత్మలు లేదా దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయని భావించేవారు.