కొన్ని సందర్భాల్లో ఇది శరీరం సహజంగా చేసే ప్రతిస్పందన మాత్రమే, కానీ కొన్ని సందర్భాల్లో ఇది జీర్ణాశయ సమస్యకు సంకేతం కూడా కావచ్చు.

మన కడుపులోకి ఆహారం వెళ్తే, పెద్దప్రేగుల పని ఒక్కసారిగా చురుకవుతుంది. ఈ ప్రక్రియను వైద్య భాషలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు.

అంటే, కడుపులో కొత్త ఆహారం చేరింది కాబట్టి, ప్రేగుల్లో ఉన్న పదార్థాన్ని బయటకు పంపించాలని శరీరం సూచిస్తుంది.

ఈ రిఫ్లెక్స్ అందరిలోనూ ఉంటుంది, కానీ కొంతమందిలో ఇది చాలా బలంగా పనిచేస్తుంది. అందుకే తక్కువగా తిన్నా కూడా మలవిసర్జన చేయాలనే కోరిక వస్తుంది.

ఈ సమయంలో విరేచనాలు, తీవ్రమైన నొప్పి లాంటి ఇబ్బందులు లేకపోతే, ఇది శరీరపు సాధారణ ప్రతిస్పందనగానే పరిగణించాలి.

కాని, ప్రతి భోజనం తర్వాత వెంటనే బాత్రూంకి వెళ్లాల్సిన అవసరం పడటం, ముఖ్యంగా చిన్నగా ఏదైనా తిన్నా కూడా వెంటనే విసర్జన కావడం – ఇది సాధారణం కాదు.

ఇలాంటి పరిస్థితులు తరచూ IBS ఉన్నవారిలో కనిపిస్తాయి. IBS‌లో ప్రేగులు చాలా సున్నితంగా మారుతాయి.

ఆహారం కడుపులోకి వెళ్లగానే అవి ఒత్తిడికి గురై, వెంటనే సంకోచించి విసర్జనకు ప్రయత్నిస్తాయి. దీని వల్ల ఉబ్బరం, గాలి పెరగడం, మలబద్ధకం లేదా ఆకస్మిక విరేచనాలు రావచ్చు.