ప్రపంచవ్యాప్తంగా విధాన అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని హెడ్జ్‌గా ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2026 వరకు ఈ డిమాండ్ తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
దీని ఫలితంగా బంగారం ధరలు మునుపటి అంచనాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. అలాగే దీర్ఘకాలిక బేస్ లెవెల్‌ను కూడా అంతే రేజ్‌లోకి నెట్టేస్తున్నాయి.
అదే విధంగా పాశ్చాత్య మార్కెట్ల నుంచి కూడా మద్దతు అనేది పెరిగే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్లను సడలించే దిశగానే అడుగులు వేస్తుంది.
2026లో దాదాపు 50 బేసిస్ పాయింట్ల రేటు కోత జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా వాతావరణం బంగారం వంటి దిగుబడి లేని ఆస్తులకు అనుకూలంగా మారుతోంది.
2026లో దాదాపు 50 బేసిస్ పాయింట్ల రేటు కోత జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా వాతావరణం బంగారం వంటి దిగుబడి లేని ఆస్తులకు అనుకూలంగా మారుతోంది.
ఇక కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కూడా కీలకం. 2026లో సగటున 60 టన్నుల బంగారం కొనుగోళ్లు జరగవచ్చని గోల్డ్‌మెన్ అంచనా. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత్తల నడుమ ప్రపంచ శక్తి సమీకరణాల్లో మార్పులు కూడా రానున్నాయి.
ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ రిజర్వులను వైవిధ్య పర్చాలని చూస్తున్నాయి. ఇక ప్రపంచ ద్రవ్య విధానాలపై అనిశ్చిత గణనీయంగా తగ్గితే..
పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం.. అదే జరిగితే, బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గోల్డ్‌మెన్ అంచనా వేస్తోంది.