ధంతేరాస్, దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా?
అసలు ఎన్ని గ్రాముల బంగారం ఇంట్లో ఉంచుకోవచ్చో మీకు తెలుసా?
ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంట్లో బంగారం ఎంత ఉంచుకోవచ్చో చెప్పే స్పష్టమైన చట్టం లేదు.
కానీ మన దగ్గర ఉన్న బంగారం ఎక్కడినుండి వచ్చిందో ఆధారాలు చూపించగలిగితే సరిపోతుంది.
ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. పన్ను అధికారుల దృష్టిలో ఇంట్లో బంగారం ఉంచడానికి పరిమితి ఉంది.
పురుషుల దగ్గర వివాహితులైనా, అవివాహితులైనా 100 గ్రాముల వరకు బంగారం ఉండొచ్చు.
అవివాహిత మహిళలైతే 250 గ్రాములు, వివాహిత మహిళలైతే 500 గ్రాముల బంగారం ఉండొచ్చు.
ఇక గరిష్టంగా ఎంత బంగారం ఇంట్లో ఉండాలి అనేదానిపై ఎలాంటి గరిష్ట పరిమితులు కావు.
ఒకవేళ ఐటి దాడులు జరిగినట్టైతే పన్ను అధికారులు చట్టబద్ధమైన బంగారం ఎంత ఉందో తెలుసుకోడానికి ఈ గైడ్‌లైన్లు ఉపయోగిస్తారు.
ఇలాంటప్పుడు బంగారం దాచిన విషయాన్ని డిక్లేర్ చేయాలా అనే డౌట్ కూడా ఉంటుంది.
ఒకవేళ అది పైన చెప్పిన లిమిట్స్ మించకపోతే ఇంట్లో బంగారం ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే గరిష్ట పరిమితి విషయంలో చిన్న లాజిక్ ఉంది. పైన చెప్పిన లిమిట్ కన్నా మీ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే మాత్రం అది ఎక్కడి నుంచొచ్చిందో వివరించగల డాక్యుమెంట్స్ ఉండాలి. లేకపోతేనే సమస్య వస్తుంది.