ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో టీ లవర్స్ ఉంటారు. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రిపేర్ చేసినా.. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ టీ పౌడర్.
తేయాకు పొడిని నీటిలో మరిగించి.. అవసరమైతే షుగర్, నిమ్మరసం, ఇతర పదార్థాలు కలిపి వివిధ రకాల టీ వెరైటీలు తయారు చేస్తారు.
కానీ ఇండియాలో మాత్రం ఎక్కువగా పాలతో చేసే మిల్క్ టీ తాగుతారు. సాధారణంగా ఇతర దేశాల్లో ప్రజలు రెగ్యులర్‌గా తాగే టీలో పాలు కలపరు.
వలసరాజ్యాలతో మొదలైన అలవాటు టీ భారతదేశంలో పుట్టలేదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పాటు ఇండియాలోకి అడుగుపెట్టింది.
1900ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులకు టీ గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు.
దానిని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాలు, చక్కెర యాడ్ చేయాలని సూచించారు. ఈ ఐడియా క్లిక్ అయింది.
భారతీయులు బ్రిటీష్ వారి టీ తాగే విధానాన్ని ఫాలో అవ్వలేదు, కానీ దాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. బ్రిటిష్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కైట్ అయింది.
తక్కువ కాలంలోనే లక్షలాది మందికి టీ లేనిదే రోజు గడవని పరిస్థితి వచ్చింది. పాలు ప్రత్యేకం ఇండియాలో ప్రతి కిచెన్‌లో పాలు ఉండాల్సిందే.
టీతో కూడా పాలకు ఇలాంటి రిలేషన్ బిల్డ్ అయింది. పాలు టీని క్రీమీగా చేస్తాయి, ఏలకులు, అల్లం వంటివి కలిపినప్పుడు మంచి టేస్ట్, సువాసన తీసుకొస్తాయి.
చక్కెర కలిపినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతుంది. దీంతో టీ ఓ డ్రింక్ కంటే మంచి ఫీలింగ్‌గా మారింది. రిలాక్స్ కావడానికి బెస్ట్ వే అయింది.