న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ప్రతిఒక్కరి వారి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది మద్యం తాగే వారు కూడా ఉంటారు.
ఐతే, భారతదేశంలో మద్యం నిల్వ పరిమితులు, తాగే కనీస వయస్సు రాష్ట్రాన్ని వేరుగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో కూడా నిబంధనలు వేరుగా ఉంటాయి.
ఇంట్లో చట్టబద్ధంగా ఎంత మద్యం ఉంచుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ లిమిట్ దాటితే జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉంది.
రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం ఎక్సైజ్ చట్టాలు, నిల్వ పరిమితులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.
ఈ పరిమితుల గురించి తెలియకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి కూడా రావచ్చు. అందుకే వేడుకలకు సిద్ధమయ్యే ముందు స్థానిక ఎక్సైజ్ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తెలుగు రాష్ట్రాలలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనుమతి లేకుండా ఒక వ్యక్తి తన ఇంట్లో గరిష్టంగా 3 బాటిళ్ల (IMFL) లేదా విదేశీ మద్యం, 6 బీరు బాటిళ్లు మాత్రమే ఉంచుకోవచ్చు.
తెలంగాణలో మాత్రం ఒక వ్యక్తి తన దగ్గర 6 బాటిళ్ల వరకు మద్యం (విస్కీ/రమ్ వంటివి), 12 బీరు బాటిళ్లు ఉంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇస్తోంది.
అంతకంటే ఎక్కువ మొత్తంలో మద్యం నిల్వ చేసి పార్టీలు చేసుకోవాలంటే కచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి ప్రత్యేక పర్మిట్ తీసుకోవాలి. పరిమితికి మించి నిల్వ ఉంటే కేసులు నమోదు చేస్తారు.