పరిశోధకులు.. కొన్ని కచ్చితమైన లెక్కలతో.. చేతి వేళ్లు, గోళ్లను బట్టీ.. వ్యక్తుల పర్శనాల్టీ ఎలా ఉంటుందో అంచనా వేశారు. ఆ క్రమంలో వేళ్లను 3 రకాలుగా విడగొట్టారు.
1వ రకం వేళ్లు.. పొడవుగా, తిన్నగా ఉంటాయి. చివర గుండ్రంగా కాకుండా.. స్క్వేర్ లాగా ఉంటాయి. అంటే గోరు గుండ్రంగా ఉండదు. చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంలా ఉంటుంది.
2వ రకం వేళ్లు.. కాస్త వంగినట్లుగా ఉంటాయి. చివర మాత్రం కోడిగుడ్డులా కోలగా, పొడవుగా ఉంటాయి. అంటే, గోరు ఆకారం కోడిగుడ్డులా ఉంటుంది.
3వ రకం వేళ్లు.. తిన్నగా ఉంటూనే మధ్యమధ్యలో ఎత్తుపల్లాలతో ఉంటాయి. చివర మరీ స్క్వేర్‌లా ఉండవు. అలాగని కోడిగుడ్డు ఆకారంలోనూ ఉండవు. మధ్యస్థంగా ఉంటాయి.
పొడవుగా, తిన్నగా ఉండే వేళ్లు:మీరు ఇలాంటి వేళ్లు ఉన్న వారిని చూస్తే.. ముందే డిజప్పాయింట్ అవుతారు. ఎందుకంటే..
తిన్నగా వేళ్లు ఉండేవారు.. తమ వ్యక్తిగత జీవితాన్నీ, ప్రైవేట్ విషయాల్నీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. తమ భావాలు, రహస్యాలను తమతోనే ఉంచుకుంటారు.
పొడవుగా, తిన్నగా ఉండే వేళ్లు:వీరు ఎవర్నీ అంత త్వరగా నమ్మరు. వీరి నమ్మకాన్ని పొందాలంటే.. తలకిందులుగా తపస్సు చెయ్యాలి.
వీరికి చాలా దగ్గరగా ఉండే, మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వారు మాత్రమే, వీరి వ్యక్తిగత విషయాల్ని తెలుసుకోగలుగుతారు. వాటిని కనిపెట్టాలంటే, చాలా తెలివి ఉండాలి.
ఈ తరహా వేళ్లు ఉండేవారు చాలా మంచివారు. ప్రేమ, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికీ ఫీల్ అవుతారు. వీరు పైకి గంభీరంగా ఉన్నా.. లోపల ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతారు వీరికి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది.
కాస్త వంగినట్లుగా ఉండే వేళ్లు:చేతి వేళ్లు కాస్త పక్కకు వంగినట్లుగా ఉండేవారు రియల్ పర్సన్లు. వీరు ఒకసారి ఎవరితోనైనా కలిస్తే.. ఇక వారిని ఎప్పటికీ వదలరు.
వీళ్లు వెంటనే ప్రేమలో పడిపోయే రకం. ఇది మంచి గుణమే అయినప్పటికీ.. దీని వల్ల వీరు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి.
అంటే.. వీరు వెంటనే ఐలవ్యూ చెప్పేసినా.. అవతలి వారు.. అదే విధంగా రెస్పాండ్ కాకపోవచ్చు. నో చెప్పవచ్చు. అలాంటప్పుడు తీవ్ర మనస్తాపం చెందే పరిస్థితి రావచ్చు.
అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్.. వీరిని మానసికంగా ఇబ్బంది పెడతాయి. కానీ వీరి ప్రేమలో నిజాయితీ ఉంటుంది.
కాస్త వంగినట్లుగా ఉండే వేళ్లు:వీరి లాగే డీప్‌గా ప్రేమించేవారు తోడుగా లభిస్తే, వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటారు.