పక్షవాతం వచ్చే ముందు  కనిపించే ముఖ్యమైన సంకేతాలు

 పక్షవాతం అత్యవసర పరిస్థితి. దీని లక్షణాలు గుర్తించడం చాలా ముఖ్యం

త్వరగా వైద్య సహాయం తీసుకుంటే, నష్టం తగ్గించుకోవచ్చు

ముఖం ఒక వైపు వంకరగా ఉండటం, నవ్వు, మాట్లాడేటప్పుడు ఒక వైపు నోరు కదలకపోవడం

 ఒక చేయి బలహీనంగా ఉండటం, వస్తువులు పట్టుకోవడంలో ఇబ్బంది

 ఒక కాలు బలహీనంగా ఉండటం, నడవడంలో ఇబ్బంది

తడబాటులు, తల తిరుగుతున్నట్లు అనిపించడం

మాటలు అస్పష్టంగా రావడం, మాటలు మర్చిపోవడం

ఒకటి లేదా రెండు కళ్ళలో దృష్టి మసకబారడం, రెండుగా కనపడటం

అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి

ఒకటి లేదా రెండు చెవులలో శబ్దాలు అస్పష్టంగా వినబడటం

ఒక వైపు శరీరంలో చలి, జలదరింపు అనిపించడం

 ఇవి.. పక్షవాతం వచ్చే ముందు కనిపించే సంకేతాలు

వీటిలో ఏ విష‌యంలోనైనా  మీకు అనుమానం వ‌స్తే

వెంట‌నే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం