ఈ 2025వ సంవత్సరంలో సెలబ్రిటీల లవ్‌ స్టోరీలు పెద్దగా సక్సెస్‌ కాలేదు. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్పోర్ట్స్ వరల్డ్ వరకు చాలా జంటలు విడిపోయాయి.

తమన్నా, విజయ్ వర్మదే అని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా ఎంతో అన్యోన్యంగా, పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట, ఈ ఏడాది ప్రారంభంలోనే విడిపోయింది.

అయితే తమ రిలేషన్‌షిప్‌పై పబ్లిక్ ఫోకస్ మరీ ఎక్కువైపోవడం, ఆ నిరంతర నిఘా వల్ల కలిగిన ‘ఊపిరాడని ఒత్తిడి’ వల్లే విడిపోవాల్సి వచ్చిందని విజయ్ వర్మ పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

‘ధరంపత్ని’ సీరియల్ సెట్స్‌లో చిగురించిన ఫహమాన్ ఖాన్, అదితి శెట్టిల ప్రేమకథకు కూడా ఎండ్ కార్డ్ పడింది. 2024లో వీరు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. 

కానీ దురదృష్టవశాత్తు ‘ఇస్ ఇష్క్ కా రబ్ రఖా’, ‘భాగ్యలక్ష్మి’ వంటి వేర్వేరు సీరియల్స్ షూటింగ్స్‌తో బిజీ అయిపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 2025 ఫిబ్రవరిలో విడిపోయినట్లు చెప్పారు.

టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ మన బాలీవుడ్ సెలబ్రిటీల్లా మారిపోయారు. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. 

కానీ వారి గ్లోబల్ స్టార్‌డమ్, విపరీతమైన బిజీ షెడ్యూల్స్ ఈ ప్రేమకు అడ్డంకిగా మారాయి. ఫిజికల్ డిస్టెన్స్ వల్ల 2025 అక్టోబర్ నాటికి వీరి మధ్య ప్రేమ కనుమరుగైంది.

పలాష్ ముచ్చల్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సడన్‌గా తమ పెళ్లిని రద్దు చేసుకున్నారు. నవంబర్‌లో ఓ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య వల్ల పెళ్లి వాయిదా పడిందని వార్తలు వచ్చినా.. 

డిసెంబర్ నాటికి అది బ్రేకప్‌ అని తెలిసింది. ఎంతో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు విడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.