మొకాళ్లపై.. మెట్లు ఎక్కి శ్రీవారి దర్శణం చేసుకున్న ఫేమస్ క్రికెటర్
మన ఇండియన్ క్రికెటర్, తెలుగు కుర్రాడు నితిష్ కుమార్ రెడ్డి మరోమారు జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతున్నాడు.
అందుకు కారణం అతనికి ఉన్న విపరీతమైన దైవ భక్తే
ఏపీకి చెందిన నితీశ్ తిరుమల వేంకటేశ్వరుడిని అమితంగా ఆరాధిస్తాడు
ఇటీవల అస్ట్రేలియా పర్యటనలో క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ సాధించి దేశం పరువు నిలబెట్టాడు.
అంతేగాక ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకంతో తన పేర క్రికెట్ చరిత్రలో సరికొత్త పేరు లిఖించుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఇటీవలే దేశానికి వచ్చిన నితీశ్ కుటుంబంతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాడు.
ఈ క్రమంలో అందరిలా వీఐపీలా వెళ్లకుండా ఆయన మెట్ల మార్గంలో మోకాళ్లపై నడుచుకుంటూ పైకి వెళ్లి మరీ ఆ స్వామి దర్శనం చేసుకున్నాడు
ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో
బాగా వైరల్ అవుతున్నాయి. నితిశ్‌కు ఉన్న దైవ భక్తిపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.