మూడు అత్యంత ప్రమాదకరమైనవి కాగా, వాటిలో ఒకటి మన భారతదేశంలోనే ఉండటం విశేషం. పొరపాటున అక్కడకు వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం దాదాపు అసాధ్యం. ఆ ప్రాంతాలు ఏవో, ఎందుకు అక్కడికి వెళ్లకూడదో ఇప్పుడు చూద్దాం.
అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రహస్య ప్రదేశాల్లో ఒకటి. దీన్ని సైనిక స్థావరం అని చెబుతున్నప్పటికీ, ఇక్కడ గ్రహాంతర వాసులు (ఏలియన్స్) సంచరిస్తారని ప్రచారం ఉంది.
ఇది అత్యంత భద్రత కలిగిన వైమానిక స్థావరం కాబట్టి సామాన్యులకు ఇక్కడికి ప్రవేశం లేదు. అనుమతి లేకుండా వెళ్తే కాల్చివేసే అధికారం అక్కడి గార్డులకు ఉంది.
బ్రెజిల్‌లోని ఈ దీవి పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. దీని అసలు పేరు 'ఇల్హా డా క్విమాడా గ్రాండే'. ఇక్కడ అడుగుకో పాము కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన
గోల్డెన్ లాన్స్‌హెడ్' వైపర్ పాములు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. వీటి విషం ఒక్క చుక్క తగిలినా మనిషి మాంసం కరిగిపోయి చనిపోతారు.
బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. కేవలం కొందరు స్మగ్లర్లు మాత్రమే పాము విషం కోసం దొంగతనంగా ఇక్కడికి వెళ్తుంటారు.
మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది ఒక భాగం. ఇక్కడ 'సెంటినలీస్' అనే ఆదివాసీ తెగ నివసిస్తోంది. వీరు నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా వేల ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు.
ఎవరైనా తమ దీవికి వస్తే శత్రువులుగా భావించి బాణాలతో దాడి చేస్తారు. 2018లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ అక్కడికి వెళ్లగా, ఆ తెగ వారు అతన్ని చంపేశారు.
భారత చట్టాల ప్రకారం ఈ దీవికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లడం నేరం. వారి ప్రశాంతతకు భంగం కలగకూడదని ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది.
ప్రపంచంలో పర్యాటకులు వెళ్లడానికి వీలులేని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు ఇవి. సాహసం పేరుతో ఇక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రాణాల మీదకు రావడం ఖాయం.