ఇసాబెల్లాస్ ఇస్లే: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ ఇది. దీని ధర దాదాపు రూ.45 కోట్లు. 

ఇది విస్కీలా కాకుండా హై-ఎండ్ ఫ్యాషన్ లేదా జ్యువెలరీ డిజైన్ లాగా కనిపిస్తుంది. బాటిల్ మీద 8,500 కంటే ఎక్కువ డైమండ్స్, 300 రూబీలు ఉంటాయి.

1926 నాటి మెకల్లాన్ వాలెరియో అదామీ ఎడిషన్ బాటిళ్లు 40 మాత్రమే ఉన్నాయి. ఇటలీకి చెందిన ప్రముఖ పాప్ ఆర్టిస్ట్ వాలెరియో అదామి 

డిజైన్ చేసిన లేబుల్ వీటికి ఉంటుంది. ఒక బాటిల్ ధర సుమారు రూ.230 కోట్ల వరకూ పలికింది.

1926 నాటి మెకల్లాన్ మైకెల్ దిల్లాన్ ఎడిషన్ బాటిల్ ఒక్కటే ఉంది. ఇది ఐరిష్ ఆర్టిస్ట్ మైకెల్ దిల్లాన్ చేతితో పెయింట్ వేసిన ఏకైక బాటిల్. UK ఆక్షన్‌లో ఇది రూ.120 కోట్లకు సేల్ అయ్యింది.

1926 నాటి మెకల్లాన్ బ్యాచ్‌లోని “స్టాండర్డ్” వేరియంట్ ఫైన్ అంద్ రేర్ కూడా అరుదైనదే. ఈ బాటిల్ ధర రూ.16 కోట్లు దాటుతోంది. .

దీన్ని వింటేజ్ విస్కీలలో “గోల్డ్ స్టాండర్డ్” అంటారు. వీటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతూనే ఉంటుంది

జపాన్‌లో ఇప్పటివరకు విడుదలైన అతి పురాతనమైన, ఖరీదైన విస్కీగా యమాజాకీ విస్కీ గుర్తింపు పొందింది. ఇది మిజునారా, అమెరికన్ ఓక్ బారెళ్లలో 55 ఏళ్లుగా ఉంది. 

ఒక్కో బాటిల్ ధర సుమారు రూ.7 కోట్లు. ఇది ఆసియాలోనే ఎక్కువ మంది కలెక్ట్ చేసుకుంటున్న ఖరీదైన విస్కీగా నిలుస్తోంది.

ఈ దాల్మోర్ బాటిళ్లు చాలా తక్కువ సంఖ్యలో తయారయ్యాయి. ఆక్షన్‌లో అమ్మినప్పుడల్లా రూ.2 నుంచి రూ.3 కోట్లు మధ్యలో దక్కుతున్నాయి. 

ఇది స్కాట్లాంట్ అరుదైన విస్కీల్లో ఒకటి. 62 ఏళ్లుగా ఆకర్షిస్తోంది.

మెకల్లాన్ లాలిక్ లెగసీ కలెక్షన్ అనేది.. 6 బాటిల్స్ సెట్. ప్రముఖ ఫ్రెంచ్ క్రిస్టల్ బ్రాండ్ లాలిక్ చేతితో తయా చేసిన డికాంటర్లలో ఉంటుంది. మొత్తం సెట్ విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుంది. 

మెకల్లాన్ రెడ్ కలెక్షన్.. ఆధునిక అల్ట్రా-ప్రీమియం సిరీస్‌లో ఇది భాగం. అరుదైన 60 ఏళ్ల ఏజింగ్ స్పిరిట్ ఇది. ధర సుమారు రూ.6 కోట్లు.