మృణాల్ ఠాకూర్, ధనుష్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న పుకార్లు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి.

వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్ల కూడా షాక్‌ అవుతున్నారు. 

మృణాల్ బర్త్‌డే పార్టీలో కూడా ధనుష్ సందడి చేశాడు. అంతే కాదు, ఓ పార్టీలో వీరిద్దరూ చేతులు పట్టుకుని సన్నిహితంగా కనిపించారు.

ఇవన్నీ చూస్తే, “ఇది ప్రేమ కాకపోతే మరేమిటి?” అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. 

అయితే, ఈ వార్తలు విన్న మృణాల్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

మొదటి పెళ్లి చేసుకోవచ్చు కదా.. “విడాకులు తీసుకున్న ధనుష్‌తో ఎందుకు నీకు? మృణాల్‌కి ఏమైంది? ఆమెకి ఏమైనా పిచ్చిపట్టిందా?” అంటూ సోషల్ మీడియాలో ఆమె పై మండిపడుతున్నారు.

అయితే, ఈ పుకార్ల పై ధనుష్, మృణాల్ ఇప్పటివరకూ ఎందుకు నోరు విప్పలేదు. దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.