ఇవాళ విశాఖలో వచ్చింది చాలా చిన్న భూకంపం. ఇంకా చెప్పాలంటే.. ప్రకంపనలు మాత్రమే వచ్చాయి.

కానీ.. చాలా అలజడి రేగింది. ఎందుకంటే.. త్వరలో మరో భారీ భూకంపం రాబోతోందనే సంకేతమే.

ఉదయం 4:19 గంటలకు వచ్చిన ఈ షాక్ వేవ్.. విశాఖపట్నం నగరంలో ప్రకంపనలు తెప్పించి.. స్థానికులను భయపెట్టింది.

భూమి ఉపరితలం నుంచి 10 కి.మీ. లోతులో ఈ భూకంపం వచ్చింది. తీవ్రత తక్కువగా ఉండటంతో.. ఎలాంటి నష్టమూ జరగలేదు.

ఈ భూకంపం వల్ల.. అల్లూరి సీతారామరాజు జిల్లా.. గ్రామాల్లో ప్రజలకు ఎక్కువగా అనుభవం కలిగింది. విశాఖపట్నం మెట్రో ప్రాంతంలో కూడా 10-15 సెకన్లు ప్రకంపనలు కొనసాగాయి.

ఆంధ్రప్రదేశ్ సిస్మిక్ జోన్-II, IIIలో ఉంది. అందువల్ల ఏపీలో భూ ప్రకంపనలు రావడం సాధారణమే అని నిపుణులు చెబుతున్నారు. ఐతే.. తరచూ ప్రకంపనలు వస్తే ప్రజలకు ఆందోళన కలుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో భూకంపాలు తరచూ వచ్చే ప్రధాన ప్రాంతాలు: విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో గోదావరి గ్రాబెన్ రిఫ్ట్ ఉంది. అంటే.. నది పగుళ్లు ఉన్నాయి. అలాగే.. తూర్పు కనుమల ఫాల్ట్ లైన్లు ఉన్నాయి. వీటికి తోడు.. బంగాళాఖాతం సబ్‌డక్షన్ జోన్‌లు ఉన్నాయి. 

ఇవన్నీ భూకంపాలు రావడానికి కారణం అవుతున్నాయి. ఇండియన్ ప్లేట్.. మయన్మార్ ప్లేట్‌తో కలిసే చోట.. కాబట్టి ఇక్కడే ఎక్కువగా భూకంపాలు వస్తున్నాయి.

గత 10 ఏళ్లలో (2015-2025) ఆంధ్రప్రదేశ్‌లో 3 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు 20కి పైగా వచ్చాయి. వీటిలో ఎక్కువ భూకంపాలు 4.5-5.1 మధ్యలో ఉన్నాయి.

బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో 40శాతం భూకంపాలు, గోదావరి లోయలో 30శాతం వచ్చాయి. ఈ ట్రెండ్ 2024-2025లో మరింత పెరిగింది.

డెసెంబర్ 2024 తెలంగాణలో వచ్చిన 5.3 తీవ్రత గల భూకంపం ప్రకంపనలు ఏపీలో కూడా వచ్చాయి. అంటే భూగర్భంలో టెన్షన్ పెరుగుతున్నట్లే.