నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత.. రీసెంట్ గా మరోసారి ప్రేమలో పడిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉందని.. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది.

ఈ పరిస్థితుల తాజాగా సమంత స్వయంగా వదిలిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో కాలంలో సమంత- రాజ్‌కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ కావడంతో సమంత రెండో పెళ్లి టాపిక్ చర్చనీయాంశం అయింది.

మరోవైపు సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ వెంటే కనిపిస్తున్నారు. సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ రాజ్ వెళ్తున్న ఫోటో దుమారమే రేపింది.

ఈ క్రమంలోనే తాజాగా రాజ్ కి బిగ్ హగ్ ఇచ్చిన ఓ ఫోటో షేర్ చేసింది సమంత. ఈ పోస్టుతో సమంత తన ప్రేమ, పెళ్లి గురించి సమంత క్లారిటీ ఇచ్చేసిందని అభిమానులు సంబరపడిపోతున్నారు.