ఇటీవల నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం మనందరికీ తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే,  సమంతకు అలాంటి పరిస్థితే ఎదురైంది.

నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సిరిమల్లె శారీస్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంతను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 

కార్యక్రమం ముగించుకుని ఆమె తిరిగి వెళ్తుండగా జనం ఒక్కసారిగా చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడటంతో తోపులాట జరిగింది.

ఈ పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు సమంత చీర కొంగును లాగబడినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. తొక్కిసలాటలో కొందరు కింద పడ్డారు కూడా.

ఇంత గందరగోళంలోనూ సమంత సహనం కోల్పోకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే సినిమా ఈవెంట్లు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలకు కఠిన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.