రైలు ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు పర్సు దొంగిలించారు.
రైల్వే అధికారుల నుండి ఆమెకు ఎలాంటి సహాయం అందలేదు. దాంతో ఆ ప్రయాణికురాలు కోపంతో ఊగిపోతూ,
తోటి ప్రయాణికులు ఆపమని అడుగుతున్నా పట్టించుకోకుండా, పదేపదే ట్రేతో అద్దాల కిటికీని కొడుతునే ఉంది.
కాసేపటికే కిటికీ పూర్తిగా పగిలిపోయింది. అద్దాల ముక్కలు కోచ్ ఫ్లోర్‌పై పడిపోయాయి.
కిటికీని పగలగొట్టే క్రమంలో ఆమె తన అరచేతికి గాయం గాయం అయింది. ఇది చూసి తోటి ప్రయాణికులు బిత్తరపోయారు