అర్థరాత్రి 12 గంటలకు ఒక ఆంటీ తన ఇంట్లోంచీ బయటకు వచ్చి.. కొంత దూరం నడిచి..
అక్కడున్న ఓ ఇంటి గేటు వైపు ఏదో విసిరి వెళ్లిపోయింది. ఈ విషయం అప్పుడు ఆ ఇం
ట్లో వాళ్లకు తెలియదు.
కానీ.. మర్నాడు వాళ్లు క్యాజువల్‌గా సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు.. ఈ విషయం తెలిసింది.
అక్కడ వారికి.. ఒక నిమ్మకాయ, ఎండుమిర్చి కనిపించాయి. వాళ్లు షాక్ అయ్యారు.
ఆమెతో వాళ్లకు ఎలాంటి గొడవలూ లేవు. మరి ఆమె పనిగట్టుకొని.. ఆ ఇంటికే వచ్చి..
గేటు దగ్గరకు నిమ్మకాయ, మిర్చిని ఎందుకు విసిరింది అనేది వాళ్లకు అర్థం కాలేదు.
ఆమె తన కుళ్లును ఇలా చూపించింది. మాకు ఆమెతో ఎలాంటి గొడవలూ లేవు. కానీ ఆమెలో ఈర్ష్యను మేము తరచూ చూస్తూనే ఉంటాం