ప్ర‌ణీత‌.. ఇద్ద‌రు పిల్లల‌  త‌ల్లి అంటే న‌మ్ముతారా

ప్ర‌ణీత సుభాష్ తెలుగు వారికి ఎక్కువ‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని న‌టి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు అవుతున్నాఇంకా ఎక్క‌డో ఓ చోట త‌న పేరు వినిపించేలా చేస్తోంది. 

తెలుగులో ఓ ప‌ది చిత్రాల వ‌ర‌కు చేసిన ఈ ముద్దుగుమ్మ‌కు ప‌వ‌న్  క‌ల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం విశేష గుర్తింపును తీసుకువ‌చ్చింది

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 2 పుష్క‌రాలు దాటినా అశించినంత‌గా అవ‌కాశాలు రాక స్టార్ స్టేట‌స్‌ను అందుకోలేక పోయింది. కెరీర్‌లో  30 చిత్రాలు మించి చేయ‌లేక పోయింది

అందం, అభిన‌యం, గ్లామ‌ర్ విష‌యంలో ఎలాంటి ఢోకా పెట్టాల్సిన అవ‌స‌రం లేని ఈ భామ హిందూ సాంప్ర‌దాయాల‌ను మాత్రం క‌డు ప‌ద్దతిగా ఆచ‌రిస్తుంది

సోష‌ల్ మీడియాలో, సామాజిక కార్య‌క్ర‌మాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే ప్ర‌ణీత‌.. ఆప‌ద‌లో ఉన్న‌వారికి కాదనకుండా సేవా కార్య‌క్ర‌మాలు

 నిర్వ‌హిస్తూ అవార్డులు ద‌క్కించుకుంది. 2021లో బెంగ‌ళూరుకు చెందిన ఓ వ్యాప‌ర‌వేత్త‌ను పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కూడా అయింది.

 అయినా ఇప్ప‌టికీ ఫ్యాష‌న్ షోల్లో పాల్గొంటూ నేటి యువ‌ హీరోయున్ల‌కు నేనేం త‌క్కువ కాదంటూ త‌న గ్లామ‌ర్  షోతో మ‌తులు పొగొడుతుంది.

తాజాగా దుబాయ్‌లో నిర్వ‌హించిన  ఓ ఫ్యాష‌న్ షోకు అదిరిపోయే డ్రెస్సింగ్‌తో హ‌జ‌రై ఆహుతుల‌ను ఆక‌ట్టుకుంది. ఇందుకు సంబంధించిన

ఫొటోలు, వీడియోలు బాగా  వైర‌ల్ కాగా వాటిని చూసిన  వారంతా ఏంటి ప్ర‌ణీత ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లేనా అంటూ అవాక్క‌వుతున్నారు.