లిఫ్ట్‌లో మిర్రర్స్ అమర్చడానికి వెనుక చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసా?

సైకాలజికల్ కంఫర్ట్చాలా మందికి చిన్న చిన్న గదుల్లోకి లేదా ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ఆందోళనగా అనిపిస్తుంది.

వాళ్లు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్‌కు లోనవుతారు. లిఫ్ట్‌లు కూడా ఒక రకమైన చిన్న గదులే కాబట్టి అందులోకి వెళ్లినప్పుడు కొందరికి యాంగ్జైటీగా అనిపించవచ్చు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లిఫ్టుల్లో అద్దాలు ఏర్పాటు చేస్తారు. ఈ మిర్రర్స్ మన చుట్టూ ఎక్కువ స్థలం ఉందనే భ్రమ కలిగిస్తాయి.

దీంతో ఇరుకైన ప్రాంతంలో ఉన్నామనే ఫీలింగ్ రాదు. లిఫ్ట్‌లో కొంచెం ప్రశాంతంగా ఉంటాం, భయం కూడా తగ్గుతుంది.

మిర్రర్స్‌తో సేఫ్టీ, సెక్యూరిటీలిఫ్ట్‌లో అద్దం ఉండటం వల్ల వెనుక ఉన్న వారిని చూడగలం. ఇది మనకు భద్రతనిస్తుంది.

అంతేకాదు లిఫ్ట్‌లో అద్దం ఉండటం వల్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మనం వెంటనే గమనించవచ్చు.

అలానే లిఫ్ట్‌లో మిర్రర్స్ ఉన్నాయని భావించి, తప్పుడు పనులు చేయడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఫలితంగా సేఫ్టీ, సెక్యూరిటీ పెరుగుతాయి.