ప్రపంచంలో 200 కోట్లకు పైగా ముస్లిం జనాభా ఉంది. ఏ దేశానికి వెళ్లినా వీరి సంఖ్య భారీగా కనిపిస్తోంది. ఐతే ఒక దేశంలో మాత్రం ఒక్క ముస్లిం కూడా కనిపించరు. అది ఏ దేశమో తెలుసా ?
ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య 200 కోట్లకు పైమాటే. మనం ఏ ఖండంలో అడుగుపెట్టినా, ఏ దేశానికి వెళ్లినా ముస్లిం జనాభా ఎంతో కొంత కనిపిస్తుంది.
అయితే పూర్తి స్థాయి సార్వభౌమాధికారం కలిగి ఉండి కూడా, అధికారిక రికార్డుల్లో ఒక్క ముస్లిం పౌరుడు కూడా లేని దేశం ఒకటి ఉంది. అదే 'వాటికన్ సిటీ'. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఆ లాజిక్ మనకు కచ్చితంగా అర్థమవుతుంది
ప్రపంచంలోనే ప్రత్యేకమైన దేశం..: వాటికన్ సిటీ అనేది ఇటలీ రాజధాని రోమ్ నగరం మధ్యలో ఉండే ఒక స్వతంత్ర దేశం. కేవలం 49 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది.
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇది సామాన్య ప్రజలు నివసించే దేశం కాదు, రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించిన ప్రపంచ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతోంది.
అక్కడ ముస్లిం పౌరులు ఎందుకు లేరు?..: వాటికన్ సిటీలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడానికి కారణం మత వివక్ష కానే కాదు. దీని వెనుక ఉన్న కారణం ఆ దేశ రాజ్యాంగ నిర్మాణం.
మామూలుగా వేరే దేశాల్లో పౌరసత్వం అనేది పుట్టుకతోనో, లేదా అక్కడికి వలస వెళ్లి స్థిరపడటం వల్లనో వస్తుంది. కానీ వాటికన్ సిటీలో రూల్స్ చాలా డిఫరెంట్.
ఇక్కడ సిటిజన్‌షిప్ అనేది కేవలం చర్చి కోసం పనిచేసే వారికి మాత్రమే ఇస్తారు. అంటే ఇక్కడ నివసించే వారంతా క్యాథలిక్ మత గురువులు లేదా చర్చి ఉద్యోగులే అయి ఉంటారు. వారి ఉద్యోగం లేదా సర్వీస్ అయిపోగానే, వారి పౌరసత్వం కూడా రద్దవుతుంది
అపోహలు వద్దు..: వాటికన్ సిటీలో ముస్లింలు లేరంటే, అక్కడ ముస్లింలను అడుగుపెట్టనివ్వరని అర్థం కాదు. ఏటా లక్షల మంది టూరిస్టులు,
ఇందులో వేలాది మంది ముస్లింలు కూడా వాటికన్ మ్యూజియంలను, సెయింట్ పీటర్స్ స్క్వేర్‌ను విజిట్ చేస్తుంటారు. ముస్లిం దేశాల రాయబారులు కూడా పోప్‌ను కలిసి ఇంటర్-ఫెయిత్ చర్చల్లో పాల్గొంటార