వర్షాకాలం రాగానే చెరువులు, కుంటల వద్ద కప్పల 'బెకబెక' శబ్దాలు మనకు సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. అసలు కప్పలు ఈ శబ్దాలను ఎందుకు చేస్తాయి? వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి?
కప్పల 'బెకబెక' శబ్దాలు మనకు సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. అసలు కప్పలు ఈ శబ్దాలను ఎందుకు చేస్తాయి? వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకుందాం.
సంతానోత్పత్తి కోసమే ఈ పిలుపులు.. కప్పలు ఆంఫిబియా వర్గానికి చెందిన జీవులు. ఇవి కార్బోనిఫెరస్ యుగం నుండి నేటి వరకు భూమిపై జీవిస్తున్నాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో మగ కప్పలు తమ స్వర పేటికల (Vocal Sacs) ద్వారా విభిన్నమైన శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శబ్దాల ద్వారా అవి ఆడ కప్పలను ఆకర్షిస్తాయి.
మగ కప్పలు వాతావరణంలో వచ్చే మార్పులను ముందుగానే గమనించగలవని, వర్ష సూచనలు ఉన్నప్పుడు అవి మరింత ఉత్సాహంగా శబ్దాలు చేస్తూ ఆడ కప్పలను అప్రమత్తం చేస్తాయి.
సంతానోత్పత్తి ప్రక్రియలో భాగంగా ఆడ కప్పలు నీటిలో కొన్ని లక్షల గుడ్లను విడుదల చేస్తాయి. మగ కప్పలు కొన్ని మిలియన్ల శుక్రకణాలను నీటిలోకి వదులుతాయి.
ఈ విధంగా వర్షాకాలంలో కప్పల సంతానోత్పత్తి ప్రక్రియ వేగవంతం అవుతుందని, అందుకే ఆ సమయంలో మనకు అధికంగా శబ్దాలు వినిపిస్తాయి.