ప్రస్తుత కాలంలో బంగారం చాలా ఖరీదైన వస్తువు. అయితే ఇంత డిమాండ్ ఉన్న బంగారం అసలు ఏ రాష్ట్రంలో ఎక్కువ దొరుకుతుంది? ఎక్కడ ఎక్కువ నిల్వలు ఉన్నాయో తెలుసా?
అయితే బంగారానికి ఇంత డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో బంగారం ఎక్కువగా ఉంది. అనే విషయాలను ఎప్పుడు చర్చించేందుకు ప్రయత్నించారా?
బంగారం ఉత్పత్తిలో ఒక రాష్ట్రం ముందంజలో ఉంటే, బంగారం నిల్వ చేయడంలో మరో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉంది. ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకుందాం.
బంగారం తవ్వకం, ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం నంబర్ వన్‌గా ఉంది. అంతే దేశంలో తవ్విన మొత్తం బంగారంలో 99 శాతం కర్ణాటక గనుల నుంచే వస్తుందన్న విషయం ఎంతమందికి తెలుసు.
రాయచూర్ జిల్లాలోని హుట్టీ బంగారు గనులు దేశంలోనే అతి పురాతనమైనవి. అలాగే అప్పటి నుంచి ఇక్కడ గోల్డ్ తవ్వడం ప్రారంభించారు. అలాగే కర్ణాటకలోని కోలార్ బంగారు క్షేత్రం బంగారం ఉత్పత్తిలో అత్యంత ప్రసిద్ధి చెందిన గని అని చెబుతున్నారు.
అలాగే గోల్డ్ ఎక్కువగా నిల్వ చేసే రాష్ట్రం మాత్రం కర్ణాటక కాదు. బిహార్. ఇక్కడ జముయ్ జిల్లాలో దాదాపు 222.8 మిలియన్ టన్నుల బంగారం ఖనిజ నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది చిన్న దేశాల గోల్డ్ నిల్వల కంటే చాలా ఎక్కువ. అయితే ఇక్కడ బంగారం తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఇంకా అన్వేషణ అనేది కొనసాగుతోంది. దేశంలోనే బిహార్‌లో 44 శాతం గోల్డ్ నిల్వలు ఉన్నాయి.
బంగారాన్ని ముఖ్యంగా నేల గనుల నుంచి పెద్ద ఎత్తున తవ్వుతారు. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ స్థానం రెండో స్థానం. 26 శాతం గోల్డ్‌ను వాడుతున్నారు.