ఇక్కడ పురుషులకు అస్సలు ప్రవేశం లేదు. ఇక్కడ మహిళలు మాత్రమే వెళ్ళగలరు. మరి, ఆ ప్రాంతం ప్రత్యేకతలు ఏంటి? పురుషులను ఎందుకు రానివ్వరో ఈ స్టోరీలో తెలుసుకుందాం
ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నా, ఫిన్లాండ్‌లోని సూపర్‌షీ ఐలాండ్ మాత్రం అందరికంటే భిన్నంగా నిలిచింది. దీనిని భూమిపై స్వర్గంలా అభివర్ణించేవారు.
ఎందుకంటే ఇక్కడ పురుషులకు అస్సలు ప్రవేశం లేదు. ఇక్కడ మహిళలు మాత్రమే వెళ్ళగలరు. మరి, ఆ ప్రాంతం ప్రత్యేకతలు ఏంటి? పురుషులను ఎందుకు రానివ్వరో ఈ స్టోరీలో తెలుసుకుందాం...
8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రైవేట్ ఐలాండ్ హెల్సింకీ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇక్కడికి వచ్చాక ప్రపంచానికి పూర్తిగా దూరమైన అనుభూతి కలుగుతుంది.
ఈ ద్వీపాన్ని 2018లో అమెరికన్ వ్యవస్థాపకురాలు క్రిస్టినా రోత్ కొనుగోలు చేసింది. ఆమె గతంలో టెక్ రంగంలో సీఈఓగా పనిచేశారు. మహిళల కోసం ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా
ప్రశాంతంగా ఉండే ప్రత్యేక జోన్ సృష్టించాలన్నదే ఆమె ఉద్దేశ్యం. ఇక్కడ ఎలాంటి అజెండాలు, అంతరాయాలు ఉండవు. ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకుంటూ, మళ్లీ శక్తిని సమీకరించుకునే అవకాశం మాత్రమే ఉంటుంది.
ఈ ఐలాండ్‌లో రాతి తీరాలు, దట్టమైన అడవులు, లగ్జరీ టచ్‌తో రూపొందించిన విలాస్ ఉన్నాయి. బోట్ల ద్వారా వచ్చే అతిథులు ప్రశాంత వాతావరణంలో నివసిస్తారు.
ఒకేసారి గరిష్ఠంగా ఎనిమిది మంది మహిళలకే అనుమతి ఇవ్వడం వల్ల వ్యక్తిగత స్పేస్ నిలబెట్టారు. అడవులతో చుట్టుముట్టిన వుడ్ కేబిన్స్‌లో యోగా, ధ్యానం, విశ్రాంతి వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు.
2018 నుంచి 2023 వరకు ఈ ఐలాండ్ మహిళల కోసం శక్తివంతమైన ఆశ్రయంగా నిలిచింది. వేలాది మంది మహిళలు ఇక్కడికి వచ్చి కొత్త స్నేహాలు ఏర్పరుచుకుని, మానసికంగా రీచార్జ్ అయి తిరిగి వెళ్లారు.
అయితే 2023లో ఈ ద్వీపాన్ని ఒక పురుష షిప్పింగ్ ఎగ్జిక్యూటివ్ సుమారు ఒక మిలియన్ యూరోలకుపైగా చెల్లించి కొనుగోలు చేశారు.
ఆ తర్వాత సూపర్‌షీ బ్రాండ్‌గా మళ్లీ ప్రారంభం కాలేదు.
2025–26లో కూడా దీనిని ‘మహిళల స్వర్గం’గా పేర్కొంటూ పలువురు ప్రస్తావిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక రిట్రీట్స్ అవసరమన్న ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా ఈ కాన్సెప్ట్ కొత్త ఊపునిచ్చిందన్నది విశేషం.