పిల్లలకు విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయురాలు, వారిని సేవకుల్లా వ్యవహరించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది.
ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఇద్దరు విద్యార్థినులతో తన కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో బయటకు రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్థానం లో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తన చేయడం పాఠశాల వ్యవస్థపై చెడు మచ్చ వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
విద్యార్థుల గౌరవం, సురక్షత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు.