భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనాలివే

భూమికి ప్రజ­లకు విడ­దీయలేని  సంబంధం ఉంది. తెలం­గాణలో  పోరా­టా­లన్నీ భూమి చుట్టూనే  తిరి­గాయి. అలాంటి తెలం­గా­ణలో  భూమి సమ­స్యల  పరి­ష్కార వ్యవస్థ ప్రజ­లకు  నిత్యం అందు­బా­టులో  ఉండాలి. కానీ 2020లో  ధరణి చట్టం అమ­లు­లోకి  వచ్చి­న­ప్పటి నుంచి  భూమి సమ­స్యల పరి­ష్కార  వ్యవస్థ ప్రజ­లకు దూర­మైంది.

గ్రామంలో రెవెన్యూ అధి­కారి లేడు..  తాసి­ల్దార్‌ దగ్గ­రకు వెళితే..  ‘నేను చేయ­గ­లి­గేది ఏమీ లేదు..  ధరణి పోర్ట­ల్‌లో దర­ఖాస్తు  చేసు­కోండి.. కలె­క్టర్ చూస్తారు’  అంటూ తిప్పి పంపిం­చే­వారు.  వ్యక్తి­గ­తంగా వెళ్లి జిల్లా కేంద్రంలో  ఉన్న కలె­క్ట­ర్‌ను కలు­వడం సగటు రైతుకు సాధ్యం అయ్యే పని కాదు. ఇలా  2020లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం అధి­కా­రు­లకు, రైతు­లకు  మధ్య ఉన్న లింకును తెంపే­సింది

 రైతులు కానీ, అధి­కా­రులు  కానీ కంప్యూ­ట­ర్‌తో మాత్రమే  మాట్లా­డేలా చేసింది. దర­ఖాస్తు  చేసుకో... ఆ తరు­వాత కలె­క్టర్  దైవా­ధీనం. తాసి­ల్దార్,  ఆర్డీ­వోలను నాటి సర్కారు  వేలిముద్రగాళ్లను మాత్రమే  చేసిం­దన్న అభి­ప్రా­యాలు  కూడా వ్యక్త­మ­య్యాయి.  తాసి­ల్దా­ర్‌కు కనీసం రిజి­స్ట్రే­షన్  చేసే బాధ్య­త­ల­నైనా ఇచ్చారు.

ఆర్డీ­వో­ల­నైతే ఎందుకు కొర­గాని  ఆరో వేలుగా నాటి సర్కారు  దిగ­జా­ర్చిం­దన్న విమ­ర్శలు  విని­పిం­చాయి. లక్షల ఎక­రాల  భూమి సమ­స్య­లన్నీ అలాగే  పెండిం­గ్‌లో ఉన్నాయి.  వ్యవ­సాయం చేసు­కునే రైతు  తన భూమి సమస్య పరి­ష్కారం  కావా­లంటే సివిల్ కోర్టుకు  వెళ్లా­ల్సిన దుస్థితి నాటి  సర్కారు కల్పిం­చింది.

భూ పరి­పా­ల­నలో ముఖ్యంగా  గ్రామ స్థాయిలో పర్య­వే­క్షక వ్యవస్థ ఉండా­లన్న నిర్ణ­యా­నికి వచ్చిన  రేవంత్ రెడ్డి  సర్కారు, భూమి  సమ­స్యల పరి­ష్కా­రా­నికి రైతులు  కోర్టుల మెట్లు ఎక్కా­ల్సిన అవ­సరం లేకుండా అధి­కా­రుల స్థాయి­లోనే  పరి­ష్కారం అయ్యే మార్గా­లను  పరి­శీ­లిం­చారు. ఈ మేరకు  ధర­ణిపై కమిటీ వేసిన రేవంత్ రెడ్డి..  ఆ కమిటీ ఇచ్చిన సూచ­నల మేరకు  భూ భారతి చట్టాన్ని తీసు­కొ­చ్చారు.

ధరణి చట్టంలో అధి­కా­రాలు  కేంద్రీకృతం చేయగా భూ భారతి  చట్టం అధి­కా­రాలను వికేం­ద్రీ­క­రణ  చేస్తు­న్నది. ధర­ణిలో కలె­క్టర్‌కు పరి­మిత అధి­కా­రాలు, ఆపైన సీసీ­ఎల్ఏ, లేదా సివిల్ కోర్టు మాత్రమే. పైగా గ్రామ స్థాయిలో ఉండే పర్య­వే­క్షక అధి­కారి (వీఆర్వో) వ్యవ­స్థను రద్దు చేసింది.  కానీ కొత్తగా అమ­లు­లోకి రానున్న  భూ భారతి చట్టంలో గ్రామ  స్థాయిలో పర్య­వే­క్షక అధి­కారి  ఉండా­లని స్పష్టం చేసింది

రైతులు కలె­క్టర్ వద్దకో.. కోర్టుల  చుట్టూ­తనో తిర­గా­ల్సిన అవ­సరం లేకుండా మండల స్థాయిలో  తాసి­ల్దారే భూమి సమ­స్య­లను  పరి­ష్క­రించే అవ­కా­శాన్ని  కల్పిం­చింది. ఈ మేరకు  తాసీ­ల్దార్ కు అధి­కా­రాలు  అప్ప­గిం­చింది. ఆపైన ఆర్డీ­ఓకు  పర్య­వే­క్షించే అధి­కారం కల్పిం­చింది.  తాసీ­ల్దార్ వద్ద పరి­ష్కారం  కానీ సమ­స్య­లను ఆర్డీఓ వద్ద, అక్కడ పరి­ష్కారం కాకుండా

 కలె­క్టర్ వద్ద రివి­జన్ పిటీ­షన్  వేయించి పరి­ష్క­రిం­చు­కునే  అవ­కా­శాన్ని భూ భారతి చట్టం  కల్పి­స్తోంది. దీంతో రైతులు తమ  భూమి సమ­స్యల పరి­ష్కారం  కోసం ఎక్క­డె­క్క­డికో  వెళ్లా­ల్సిన అవ­సరం లేకుండా  స్థాని­కంగా పరి­ష్క­రించే  అవ­కా­శాన్ని కొత్త ప్రభుత్వం  కల్పిం­చ­ను­న్నది.