భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు.

సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి...దక్షిణం వైపు పయనిస్తే దక్షిణానయం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో 

మంచి జరుగుతుందని శాస్త్రం చెపుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెపుతున్నారు.

భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భోగి రోజున పాత బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటలో వేయడం ఆనవాయితీ. 

ఇది పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం వంటిది. భోగి మంటలో పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి, కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం

ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక. జనవరి మాసంలోచలి అధికంగా ఉండడం వలన చలిని తప్పించుకోవడం కోసం కూడా ఈ బోగి వేస్తుంటారు అని కొందరి నమ్మకం.