బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందరూ బంగారం ప్రియులే. ఈ మధ్యకాలంలో గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. అయినాసరే బంగారం మీద ఉన్న ప్రేమతో చాలా మంది కొనుగోళ్లకు వెనుకడుగు వేయడం లేదు.
మరి అంతగా ఇష్టపడే బంగారం అసలు పసుపు రంగులో ఎందుకు ఉంటుంది. అసలు ఆ రంగులోనే ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఇంకా ఏమైనా రంగుల్లో బంగారం లభిస్తుందా?వంటి ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు చూద్దాం.
బంగారం పసుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం దాని లోపలి అణు నిర్మాణం, కాంతితో అది చేసే ప్రత్యేక పరస్పర చర్య. సాధారణంగా చాలా లోహాలు వెండి లేదా బూడిద రంగులో కనిపిస్తాయి.
బంగారం ఒక లోహం కావడంతో దాని అణువుల్లో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు కాంతి పడినప్పుడు కొన్ని తరంగదైర్ఘ్యాల కాంతిని గ్రహిస్తాయి, కొన్ని తరంగదైర్ఘ్యాల కాంతిని బయటకు విడుదల చేస్తాయి.
బంగారం విషయంలో, అది నీలం, ఊదా రంగుల కాంతిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఎరుపు, పసుపు రంగుల కాంతిని ఎక్కువగా తిరిగి విడుదల చేస్తుంది. మన కళ్లకు కనిపించేది బయటకు వచ్చే కాంతే కాబట్టి, బంగారం మనకు పసుపు రంగులో మాత్రమే కనిపిస్తుంది.
బంగారం అణువుల్లో ఉన్న ఎలక్ట్రాన్లు చాలా వేగంగా కదులుతాయి. దీనిని సైన్స్ ప్రకారం చెప్పాలంటే సాపేక్ష ప్రభావం అని అంటారు. బంగారం వంటి భారీ లోహాల్లో, అణువుల మధ్య కేంద్రంలో ఉన్న ఎలక్ట్రాన్లు వెలుగు వేగానికి దగ్గరగా కదులుతాయి
ఈ వేగం వల్ల వాటి శక్తి స్థాయిల్లో మార్పు వస్తుంది. దాంతో బంగారం కాంతిని గ్రహించే విధానం మారుతుంది. ఇదే బంగారం రంగుకు ముఖ్య కారణం అవుతుంది.
మరో విషయం ఏమిటంటే, బంగారం తుప్పు పట్టదు. ఇతర లోహాలు గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసిపోయి రంగు మారుస్తాయి. కానీ బంగారం చాలా స్థిరమైన లోహం.
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే బంగారం పసుపు రంగులో ఉండటానికి కారణం దాని అణువుల నిర్మాణం, వేగంగా కదిలే ఎలక్ట్రాన్లు, కాంతిని గ్రహించే విధానం, తుప్పు పట్టని స్వభావం. ఇవన్నీ కలిపి బంగారానికి మెరుపు ధరలను అందిస్తున్నాయి