చలికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతుంటారు. మరోవైపు నీళ్లు చల్లగా ఉంటాయి.
ఉదయం సాయంత్రం వేళలో నీటిని ముట్టుకోవాలంటే చేతులు వణికి పోతుంటాయి. అందుకే చలికాలంలో చాలామంది సహజంగా వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు.
అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా కొన్ని రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయి. వేడి నీళ్లు తల చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి.
ఇది చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలకు దారితీస్తుంది. అతి వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా కొన్నిసార్లు తలనొప్పి పెరగవచ్చు.
కొందరికి తాత్కాలికంగా బీపీ తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
చర్మ సమస్యలు ఉన్నవారు అతిగా వేడి నీరు చేయడం ద్వారా అవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా ఏ వ్యక్తికైనా ప్రమాదమే.