1.ఆల్ఫా-లీనోలోనీక్ యాసిడ్ (ఏఎల్ఏ). ఇది కూరగాయల్లోనూ, ఆకుకూరల్లోనూ లభిస్తుంది. వాల్ నట్స్, ఫ్లాక్ సీడ్స్, చియాసీడ్స్‌లలోనూ దొరుకుతుంది. 2.ఈకోసాపెంటానోయిక్ యాసిడ్లు (ఈపీఏ). ఇవి ఎక్కువగా సముద్ర ఆహారాల్లో లభిస్తాయి. 3.డెకోసాహెక్జానోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ). ఇవి సముద్ర ఆహారం, గుడ్లు (ఫారం గుడ్ల కంటే నాటు గుడ్లలో అత్యధికంగా ఉంటాయి), తల్లిపాలల్లో లభ్యమవుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒమెగా-3 ఫ్యాట్స్ అవసరమని, అవి ఒమెగా-3 యాసిడ్స్ ఎక్కువ ఉండే చేపలు తినడం ద్వారానే సమృద్ధిగా లభిస్తాయని నేషనల్ హార్ట్ ఫౌండేషన్ పేర్కొంటున్నది.