Site icon vidhaatha

Naresh| నా బేబి నన్ను వ‌దిలేసి పోయిందంటూ బోరున ఏడ్చిన న‌రేష్‌..ఒంట‌రైపోయాడుగా..!

Naresh|  సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ గ‌త కొద్ది రోజులుగా ప‌విత్రా లోకేష్‌తో సీక్రెట్ రిలేష‌న్ షిప్ కొన‌సాగిస్తుండ‌గా, వారికి సంబంధించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి.. వీరిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కూడా సంచలనం రేకెత్తింది. అయితే త‌న జీవితానికి ద‌గ్గ‌ర‌గా మ‌ళ్లీ పెళ్లి అనే సినిమా చేయ‌డంతో పాటు అందులో ప‌విత్ర‌కి లిప్ లాక్‌లు, హ‌గ్గులు ఇలా మ‌నోడు చేసిన ర‌చ్చ మాములుగా లేదు. అయితే ఏడాదికి పదుల వ‌య‌స్సులో కూడా నరేష్ చిత్రాలు చేస్తున్నారు. తాజాగా న‌రేష్ త‌న మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా క‌న్నీరు పెట్టుకోవ‌డం హాట్ టాపిక్ అయింది.

న‌రేష్ స‌డెన్‌గా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఇందులో తన బేబీ ఎక్కడో తప్పిపోయిందని.. దీనంగా కనిపించన వారందరినీ అడుగుతున్నాను. అది ఒక్కరోజు కంటికి కనిపించకపోయినా.. మా ఇంటిల్లిపాదికి ముద్ద కూడా దిగ‌దని న‌రేష్ చెప్పుకొచ్చాడు. నా బేబి క‌నిప‌స్తే క‌బురు పెట్టాలంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. పైగా అందరూ కల్కి సినిమాలోని బుజ్జి తెలుసుగానీ.. ఈ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారని.. తమ బేబీని ఎలాగైన వెతికి పెట్టాలంటూ ఏకంగా క‌ల్కి చిత్ర యూనిట్‌తో పాటు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌ని కూడా ట్యాగ్ చేశాడు.

కల్కి సినిమా వాళ్లకు బుజ్జి ఎలాగో.. తనకు బేబీ కూడా అలాగే అని.. ఎలాగైనా తన బేబీ కనిపిస్తే మాకు తెచ్చి ఇవ్వండి ప్లీజ్ అంటూ చాలా రిక్వెస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో షేర్ చేసి న‌రేష్ క‌న్నీరు మున్నీరుగా విల‌పించ‌డంతో అంద‌రు ప‌విత్ర విష‌యంలో న‌రేష్ ఇలా బాధ‌ప‌డుతున్నాడ‌ని అనుకున్నారు. కాని ఇదంతా సినిమా ప్ర‌మోష‌న్ కోసం అని త‌ర్వాత అర్ధ‌మైంది. నరేష్ తన కొత్త సినిమా వీరాంజనేయులు విహారాయాత్ర కోసం ఈ వెరైటీ ప్రమోషన్ చేశాడు. ఇందులో నరేష్ తోపాటు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కీడా కోలా ఫేమ్ రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని కీలకపాత్రలు పోషిస్తున్నారు. గోవా ప్రయాణంలో తమకు ఎదురైన పరిస్థితుల నేప‌థ్యంలో సినిమా రూపొందింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం న‌రేష్ చేసిన యాక్టింగ్ ఒక్క‌సారిగా మూవీపై అంద‌రి ఫోక‌స్ ప‌డేలా చేసింది.

Exit mobile version