Site icon vidhaatha

Rajinikanth| అర్జున్ కూతురి రిసెప్ష‌న్‌లో ర‌జ‌నీకాంత్‌కి అవ‌మానం.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్స్

Rajinikanth| హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగులో ఆయ‌న చాలా సూప‌ర్ హిట్స్ కొట్టి టాలీవుడ్ ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు.ఆ మ‌ధ్య విశ్వ‌క్ సేన్‌తో ఓ మూవీ డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాడు. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ ఆగింది. అయితే అర్జున్ గ‌త కొద్ది రోజులుగా త‌న కూతురు పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. జూన్ 10న అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య-ఉమాపతి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో కన్నడ నటుడు ధృవ సర్జా కూడా పాల్గొన్నారు. చెన్నైలోని గెరుగంబాక్కంలోని హనుమాన్ దేవాలయంలో ఐశ్వర్య, ఉమాపతి సంప్రదాయబద్ధంగా వివాహం జ‌ర‌గ‌గా, ఆ జంట‌కి కన్నడతోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆశీర్వచ‌నాలు అందించారు.

ఇక సినీ ప్ర‌ముఖుల కోసం రీసెంట్‌గా రిసెప్ష‌న్ వేడుక కూడా నిర్వ‌హించారు. ఈ రిసెప్ష‌న్ వేడుక‌కి సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శివకార్తికేయన్, శశికుమార్, ప్రసన్న, కూల్ సురేశ్, నటి స్నేహ, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, విజయభాస్కర్, జికె వాసన్, అన్నామలై, డిటివి దినకరన్, అన్బుమణి రామదాస్ వంటి ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌కి త‌మ ఆశీస్సులు అందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి వివాహ వేడుకకు హాజ‌రు కాగా, ఆయ‌న వ‌ధూవ‌రుల కోసం ప్ర‌త్యేక బ‌హుమతి కూడా తీసుకు వ‌చ్చారు.

ర‌జ‌నీకాంత్ ఇచ్చిన బ‌హుమ‌తిని వ‌ధూవ‌రుల‌తో పాటు అర్జున్ మ‌రియు అత‌ని సోద‌రుడు రామ‌య్య ఫ్యామిలీ ఎవ‌రు ప‌ట్టించుకోకుండా నిలుచున్నారు. దాంతో ర‌జ‌నీకాంత్ త‌ను తెచ్చిన గిఫ్ట్‌ని ప‌క్క‌న పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతపెద్దాయన బహుమతి ఇస్తుంటే దిక్కులు చూస్తారెందుకు , పెద్దాయ‌న అంటే మీకు లెక్క‌లేదా అంటూ అర్జున్ మరియు తాంబరామయ్య కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రజినీకాంత్ పెద్దగా పట్టించుకోలేదంటూ మ‌రికొంద‌రు కొట్టిపారేస్తున్నారు.

Exit mobile version