Site icon vidhaatha

Samantha|స‌మంత మ‌రో సావిత్రిలా మారుతుందా.. ఆమె జీవితంలో ఇన్ని ట్విస్ట్‌లా..!

Samantha| ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన స‌మంత ఇప్పుడు క‌ష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది. ఓవైపు ప్రేమ, పెళ్లి విఫలం కావడంతో మానసిక సంఘర్షణ.. మరోవైపు మయోసైటిస్ సమస్య త‌న‌ని అనేక ఇబ్బందుల్లో ప‌డేసింది. అయ‌తే సమంత ఎప్పుడూ ఎనర్జిటిక్ గా.. ఇతరులకు ఇన్ స్పిరేషన్ గానే కనిపిస్తుంటారు. ఆమె చేసే సినిమాలు.. వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సామ్ తన బాల్యజీవితంలో కూడా క‌ష్టాలు ప‌డింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సామ్ చిన్నతనంలోనే ఎన్నో క‌ష్టాలు చ‌వి చూసింది. అందుకే ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. అయితే సమంత జీవితం మరో సావిత్రిలా మారిపోయిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

సమంత కూడా సావిత్రి మాదిరిగానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన జెమినీ గ‌ణేష‌న్‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత సావిత్రి క్రేజ్ పెరిగింది. సావిత్రి పెద్ద స్టార్‌గా ఎదగడం చేతినిండా సినిమాలు ఉండటం, అదే స‌మ‌యంలో జెమినీ గ‌ణేష్ కెరియ‌ర్ ప‌డిపోవ‌డం జ‌రిగింది. అయితే సావిత్రి ఎదుగుద‌ల‌ని జెమినీ గ‌ణేష‌న్ త‌ట్టుకోలేక‌పోయాడు. ఈ క్రమంలో మరో మహిళలతో ఉండటం ప్రారంభించాడు. సావిత్రి ఎన్నిసార్లు వెళ్లి బతిమిలాడినప్పటికీ ఆమెను అసహ్యించుకున్నాడే తప్ప దగ్గరకు చేరనీయలేదు. అయితే ఓ సారి జెమినీ గణేశన్ ను మరో మహిళతో ఉండటం చూసిన సావిత్రి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, మద్యానికి బానిసైంది

కటిక పేదరికంలోకి దిగిజారిపోవడం క్రమంగా ఆరోగ్యం క్షీణించడం, చివరికి కన్నుమూసింది. ఇక స‌మంత జీవితం విష‌యానికి వ‌స్తే పెళ్లి నాటికే సమంతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.. ఆమె పట్టిందల్లా బంగారమైంది. స‌మంత‌కి క్రేజ్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. నాగ చైతన్య మాత్రం కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓవైపు సమంత హిట్ మీద హిట్ కొట్టి క్రేజ్ పెంచుకుంటూ పోతుంటే… నాగ చైతన్య పై మాత్రం ఫ్లాప్ స్టార్ అనే ముద్ర పడింది. ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు వ‌చ్చి విడిపోయారు. ఆ త‌ర్వాత స‌మంత ఆరోగ్యం క్షీణించింది. చైతూ ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రేమించిన వ్య‌క్తి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటుండ‌డం కొంత బాధిస్తూనే ఉంటుంది. అయితే సావిత్రాలా స‌మంత కుంగిపోదు. గ‌ట్టిగా నిల‌బ‌డి లైఫ్‌లో మంచి స్థానానినికి చేరుకుంటుంద‌ని అభిమానులు అంటున్నారు. కాని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తే సమంత , సావిత్రి జీవితాలు రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి.

Exit mobile version