- బదలాయింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేయండి
- అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్
Osmania Hospital । ఉస్మానియా హాస్పిటల్‌ను గోషామహల్కు (Goshamahal) తరలించాలని తరలించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ మేరకు భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్ లను రూపొందించాలని తెలిపారు. వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్ లు ఉండేలా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి (Goshamahal City Police Academy) ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అందరికీ హెల్త్ కార్డులు.. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన
రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ ప్రొఫైల్(health profile) ను సిద్దం చేసి, హెల్త్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రజాపాలనలో రేషన్ కార్డు లు(ration cards), హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ ఉన్నతాధికారులను, శాఖాదిపతులను ఆదేశించారు.