తాబేళ్లను వదలని దొంగలు.. 20 బస్తాల్లో 1589 తాబేళ్లు అక్రమ రవాణా

అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హమన్నట్లుగా దొంగలు తమ దొంగతనానికి ఏదైనా ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ఓ వాహనంతో పాటు వాటిని తరలిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు

  • Publish Date - May 16, 2024 / 02:00 PM IST

విధాత : అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హమన్నట్లుగా దొంగలు తమ దొంగతనానికి ఏదైనా ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ఓ వాహనంతో పాటు వాటిని తరలిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్ పేట చెక్ పోస్టు వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్నఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

ఉల్లిపాయల రవాణా మాటున 20 బస్తాల్లో సుమారు 1589 తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్నారని, వాటితో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎఫ్ఓ నరేంద్రన్ వెల్లడించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిస్సా ప్రాంతానికి తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్నట్టుగా తెలిపారు. గోదావరి జలాల్లో దొరికే ఈ తాబేళ్లను ఎక్కువగా ఒడిస్సాలో మాంసం కోసం ఎక్కువగా వాడుతారని తెలిపారు. పట్టుబడిన తాబేళ్లలో 163మృతి చెంది ఉన్నాయని, నిందితులను కోర్టులో హాజరుపరిచి, తాబేళ్లను నీటి వనరులలో వదిలిపెడుతామన్నారు.

Latest News