Site icon vidhaatha

ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో4,684 కరోనా కేసులు

విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో 80,712 నమూనాలను పరీక్షించగా 4,684 కరోనా కేసులు.. 36 మరణాలు నమోదయ్యాయి. మరో 7,324 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 51,204 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటివరకు 2.13 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించగా.. 18,62,036 మందిలో వైరస్‌ నిర్థరణ అయింది. కరోనాను 17,98,380 మంది జయించగా, 12,452 మంది మృతి చెందారు.

Exit mobile version