Site icon vidhaatha

సాయంత్రం 6 గం. ల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలు

కడప జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా .. స్థానిక పరిస్థితులను అనుసరించి సాయంత్రం 6 గం. ల నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వెంటనే ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జిలా కలెక్టర్ సి. హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ( సోమవారం) సాయంత్రం జిల్లా ఇంచార్జి మంత్రి నేతృత్వంలో జరిగిన జిల్లా స్ధాయి కమిటీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటి దాకా రాత్రి 10 గం. లనుంచి ఉదయం 5 గం.ల వరకు రాత్రి కర్ఫ్యూ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా సదరు కేసులను తగ్గించడానికి , జిల్లాలో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకోవడానికి వెసులుబాటు ను బట్టి రాత్రి 10 గం. లనుంచి ఉదయం 5 గం.ల వరకు ఉన్న కర్ఫ్యూ కు అదనంగా మరో నాలుగు గంటలు పెంచుతూ.. సాయంత్రం 6 గం. ల నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ ను పోలీస్ శాఖ తో సమన్వయంతో అమలు చేస్తామన్నారు.

రంజాన్ సందర్భంగా హలీం.. లాంటి తినుబండారాలను టేక్ అవే రూపంలో విక్రయించాలని, ఎక్కడా కూర్చుని తినడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి టీ షాపుల వద్ద కానీ, మరెక్కడైన కానీ గుమికాకూడదని, రాత్రి కర్ఫ్యూ కు సహకరించి జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Exit mobile version