దుర్గ‌గుడి టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌

విధాత:విజయవాడలోని దుర్గ‌గుడి టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌ తగిలింది.శానిటేష‌న్‌, హౌస్ కీపింగ్ కోసం దుర్గ గుడి అధికారులు టెండ‌ర్లను పిలిచారు.టెక్నిక‌ల్ బిడ్‌లో అర్హ‌త సాధించ‌లేద‌ని లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ను అధికారులు టెండర్లో పాల్గొన‌కుండా చేశారు.దీనిపై లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ హైర్టును ఆశ్ర‌యించింది.సంస్థ‌ను హైకోర్టును ఆశ్ర‌యించింద‌ని తెలిసిన వెంట‌నే అధికారులు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశారు.పాత కాంట్రాక్ట‌ర్‌ను కొన‌సాగించేందుకు రెండేళ్ల నుంచి టెండ‌ర్లు పిల‌వ‌కుండా జాప్యం చేస్తున్నార‌ని న్యాయ‌వాది ముప్పుటూరి వేణుగోపాల‌రావు వాదించారు. ఎప్ప‌టిక‌ప్పుడు టెండ‌ర్ల‌ను పిలవ‌కుండా జాప్యం చేస్తున్నార‌ని […]

  • Publish Date - September 4, 2021 / 09:30 AM IST

విధాత:విజయవాడలోని దుర్గ‌గుడి టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌ తగిలింది.శానిటేష‌న్‌, హౌస్ కీపింగ్ కోసం దుర్గ గుడి అధికారులు టెండ‌ర్లను పిలిచారు.టెక్నిక‌ల్ బిడ్‌లో అర్హ‌త సాధించ‌లేద‌ని లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ను అధికారులు టెండర్లో పాల్గొన‌కుండా చేశారు.దీనిపై లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ హైర్టును ఆశ్ర‌యించింది.సంస్థ‌ను హైకోర్టును ఆశ్ర‌యించింద‌ని తెలిసిన వెంట‌నే అధికారులు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశారు.పాత కాంట్రాక్ట‌ర్‌ను కొన‌సాగించేందుకు రెండేళ్ల నుంచి టెండ‌ర్లు పిల‌వ‌కుండా జాప్యం చేస్తున్నార‌ని న్యాయ‌వాది ముప్పుటూరి వేణుగోపాల‌రావు వాదించారు.

ఎప్ప‌టిక‌ప్పుడు టెండ‌ర్ల‌ను పిలవ‌కుండా జాప్యం చేస్తున్నార‌ని ధ‌ర్మాస‌నం ముందు వాద‌న‌లు ఉంచారు.దీంతో ర‌ద్దు చేసిన టెండ‌ర్ల‌ను రీ ఓపెన్ చేయాల‌ని హైకోర్టు తీర్పునిచ్చింది.లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ను టెండ‌ర్ల‌లో పాల్గొనే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది.వెంట‌నే టెండ‌ర్ల‌ను తెర‌వాల‌ని హైకోర్టు ఆదేశించింది.

Latest News