Site icon vidhaatha

అమరావతి యాత్ర కలెక్షన్ బాగుంది..! తొలిరోజు రూ.16 లక్షలు

ఉన్న‌మాట: కలెక్షన్ అనగానే అదేదో సినిమా కలెక్షన్ అనుకోకండి. ఈమధ్య పెద్ద పెద్ద అంచనాలతో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. కలెక్షన్ నిల్ అయిపోతుంది. కానీ అమరావతి కోసం రైతులు చేస్తున్న పాదయాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్ల వాన కురుస్తోంది. మొదటిరోజు శుక్రవారం అచ్చంగా రూ.16 లక్షలు చందాలు వచ్చాయని ఉద్యమకారులు చెప్పారు.

ఇంకా చాన్నాళ్ల యాత్ర ఉంది కాబట్టి ఇంకెంత వసూలు అవుతాయో అని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అప్పుడే పంచ్‌లు పేలుస్తోంది. అమ‌రావ‌తిలోనే ప‌రిపాల‌న రాజ‌ధాని కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో అర‌స‌వ‌ల్లి దాకా మ‌హా పాద‌యాత్ర శుక్రవారం ప్రారంభ‌మైంది. వాస్తవానికి న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ పేరుతో గ‌తంలో హైకోర్టు నుంచి తిరుప‌తి దాకా పాద‌యాత్ర‌-1 పూర్తి చేశారు.

అప్ప‌ట్లో భారీ మొత్తంలో విరాళాలు సేక‌రించారు. కానీ లెక్క‌లు చెప్ప‌లేద‌నే కార‌ణంతో అప్పట్లో అమ‌రావ‌తి జేఏసీలో విభేదాలు తలెత్తాయి చేసుకున్నాయి. కేవ‌లం విరాళాలు సేక‌రించి చంద్ర‌బాబుకు ముట్ట‌ జెప్ప‌డానికే అని ఇటీవ‌ల మాజీ మంత్రి కొడాలి నాని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మలివిడత యాత్ర మొదలు అయ్యాక తొలిరోజు కలెక్షన్ రూ.16 లక్షకు వచ్చాయి. భాష్యం ప్ర‌వీణ్ ట్ర‌స్ట్ త‌ర‌పున రూ.5 ల‌క్ష‌ల చెక్కు, ఎర్ర‌బాలెం రైతులు రూ.4 ల‌క్ష‌లు, మంగ‌ళ‌గిరి వైద్యుల సంఘం రూ.ల‌క్ష‌, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌ల్లి ఆలూరి జ‌య‌ప్ర‌ద రూ.ల‌క్ష చెక్కును అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మ‌తి, రాజ‌ధాని రైతు ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి నేత‌ల‌కు అంద‌జేశారు.

మొద‌టి రోజు షోకే రూ.16 ల‌క్ష‌లు వ‌సూలైతే, రెండు నెల‌ల్లో ఏ రేంజ్‌లో ఉంటుందో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతోబాటు ఏజేసీ నాయకులు రైతులు సైతం మంత్రి కొడాలి నాని ఇతర ప్రభుత్వ ముఖ్యులను బూతులతో తిడుతూ యాత్రలో పాల్గొంటున్నారు.

ఇంకా తెలంగాణ నుంచి కూడా కొందరు మహిళలు వచ్చి యాత్రలో పాల్గొంటున్నారు. అయితే తమకు అమరావతిలో భూములు లేవని, కేవలం తమ కులం కోసమే ఉద్యమానికి వస్తున్నామని టివీ ఛానళ్లలో చెప్పిన బైట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Exit mobile version