నామినేటెడ్ పదవుల ప్రకటనకు సిద్దం
కేబినెట్ – ఎమ్మెల్సీలపైనా క్లారిటీ..!!
విధాత:ఏపీలో వైసీపీ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు ప్రకటనకు రంగం సిద్దమైంది.దాదాపుగా పదవుల కేటాయింపు పూర్తయింది.దీని పైన ముఖ్యమంత్రి సైతం అంగీకారం చెబుతూనే కొన్ని కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.దీంతో..వాటిని అమలు చేస్తూ ఈ రాత్రికి లేదా రేపు నామినేటెడ్ పోస్టులను ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది.
రానున్న మంత్రివర్గ విస్తరణ.. స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది..
ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన మూడు స్థానాల పైన ఒక అంచనాకు వచ్చిన తరువాతనే ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సమాచారం.
ఓడిన నేతలకూ పోస్టులు..
పార్టీ కోసం తొలి నుండి పని చేస్తున్న ద్వితీయ శ్రేణి నేతలకు జిల్లా స్థాయి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు.అదే సమయంలో సీఎం జగన్ పాలసీగా నిర్ణయించిన విధంగా సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేస్తున్నారు.
ఇక..
రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ ..మైనింగ్ కార్పోరేషన్..సివిల్ సప్లయిస్ కార్పోరేషన్..పోలీసు హౌసింగ్ కార్పోరేషన్..
వంటి 32 పోస్టుల పైన పేర్లు దాదాపుగా నిర్ణయం అయినట్లుగా తెలుస్తోంది.రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులో ప్రధానంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.అందులో కొందరికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు.
వారిలో ఇంకా పదవులు ఇవ్వలేకపోయిన వారికి రాష్ట్ర స్థాయి పోస్టులు ఇవ్వబోతున్నారు.
దాదాపుగా ఖరారైన పేర్లు ఇవే..
అందులో ప్రధానంగా ఆమంచి క్రిష్ణమోహన్, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, తోట వాణి, రౌతు సూర్యప్రకాశ రావు, దేవినేని అవినాశ్,బొప్పన భావన కుమార్,బాచిన చైతన్య వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.ఇప్పటికే రిజర్వేషన్ల వారీగా జిల్లా పరిషత్ లు ఖరారు కావటంతో ఏ జిల్లాలో ఎవరు జెడ్పీ ఛైర్మన్ చేయాలనే అంశం పైనా సీఎం జగన్ క్లారిటీతో ఉన్నారు.అయితే హైకోర్టు జెడ్పీటీసీ – ఎంపీటీసీ ఎన్నికల రద్దు నిర్ణయం పైన డివిజన్ బెంచ్ స్టే ఇచ్చినా..తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.ఆ తరువాతనే ఆ ఎన్నికల కొనసాగింపుగా ఓట్ల లెక్కింపు లేదా కొత్తగా ఎన్నికలు జరపటమా అనే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసి ఓడి నయోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా ఉన్న వారికి సైతం ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గకుండా..గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగానే వారిని నియోజకవర్గాల్లో గౌరవం దక్కేలా నిర్ణయం తీసుకుంటున్నారు.
కొత్త ఒరవడి..ఓడినా ప్రాధాన్యత దీంతో..
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు..ఓడిన నేతలు హోదాలోనే ఉంటారు.కుప్పంలో చంద్రబాబు పై పోటీ చేసిన మరణించిన చంద్రమౌళి కుమారుడికి సైతం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జన్మదినం సందర్బంగా నామినేటెడ్ పోస్టులను విడుదల చేయాలని భావించినా..కసరత్తు పూర్తి కాకపోవటంతో నిలిచి పోయింది.
ఈ రాత్రికి లేదా రేపు నామినేటెడ్ పదవుల లిస్టు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతల సమాచారం.భవిష్యత్ సమీకరణాలకు కీలకంగా..ఇప్పుడు ప్రకటించే లిస్టు ఆధారంగా భవిష్యత్ లో పదవులు పొందే నేతలు ఎవరే దానికి సంబంధించి సంకేతాలు అంద నున్నాయి.దీంతో…ఈ లిస్టు పైన వైసీపీ ఆశావాహుల్లో అసక్తి నెలకొని ఉంది.త్వరలోనే దాదాపు 80 శాతం మేర మంత్రులు సైతం మారనున్నారు.వారి స్థానంలో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారు.అదే ఎన్నికల కేబినెట్ కావటంతో…ఆ ఎంపిక చుట్టూనే ప్రస్తుత నామినేటెడ్ పోస్టులు.. ఎమ్మెల్సీల పదవుల ఎంపిక ఆధారపడి ఉంది.