MLC elections schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదల

MLC elections schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దాంతో ఖాళీ అయిన ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

  • Publish Date - June 26, 2024 / 07:09 PM IST

MLC elections schedule : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దాంతో ఖాళీ అయిన ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికల కోసం బుధవారం (జూన్ 26) నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు జూలై 2వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూలై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జూలై 5 వరకు అవకాశం ఉంటుంది. పోలింగ్ నిర్వహించిన రోజునే ఫలితాలు వెల్లడిస్తారు.

అయితే ఎన్నికలు జరగనున్న ఈ రెండు స్థానాలు కూటమికే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పూర్తిగా ఎమ్మెల్యేల బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీకి కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. మిగతా అందరూ కూటమి ఎమ్మెల్యేలే కాబట్టి కూటమి అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించనున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థులను బరిలో దించితే జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒకవేళ వైసీపీ పోటీ చేయకపోతే కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.

Latest News