AP:47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

కార్పొరేషన్ల డైరెక్టర్ల నియామకంలోనూ సామాజిక న్యాయం.. 47 కార్పొరేషన్లలో 481 డైరెక్టర్లను నియమిస్తూ ప్రకటన డైరెక్టర్లలో 52 శాతం మహిళలు.. 48 శాతం పురుషులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం(58 శాతం)-ఓసీలకు 42 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల్లో విశ్వాసం పాదుగొల్పేందుకు చిత్తశుద్ధి, నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తుందిః సజ్జల సీఎం జగన్ గారు మహిళా పక్షపాతి, మహిళలకు అన్నింటా గౌరవం, గుర్తింపు: హోం మంత్రి సుచరిత సామాజిక న్యాయానికి ఇంతటి ప్రాధాన్యత […]

  • Publish Date - September 4, 2021 / 10:12 AM IST

  • కార్పొరేషన్ల డైరెక్టర్ల నియామకంలోనూ సామాజిక న్యాయం..
  • 47 కార్పొరేషన్లలో 481 డైరెక్టర్లను నియమిస్తూ ప్రకటన
  • డైరెక్టర్లలో 52 శాతం మహిళలు.. 48 శాతం పురుషులు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం(58 శాతం)-ఓసీలకు 42 శాతం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల్లో విశ్వాసం పాదుగొల్పేందుకు చిత్తశుద్ధి, నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తుందిః సజ్జల
  • సీఎం జగన్ గారు మహిళా పక్షపాతి, మహిళలకు అన్నింటా గౌరవం, గుర్తింపు: హోం మంత్రి సుచరిత
  • సామాజిక న్యాయానికి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో మరెవరూ లేరుః మంత్రి వేణుగోపాల కృష్ణ

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..

విధాత:47 కార్పొరేషన్లు–481 డైరెక్టర్లు‘ఇవాళ 47 కార్పొరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటిస్తున్నాం. 481 మంది డైరెక్టర్లలో 52 శాతం మహిళలు ఉండగా, 48 శాతం పురుషులు ఉన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇంకా డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వగా, 42 శాతం పదవులు ఓసీలకు ఇచ్చాం’.
‘సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు మరింత ప్రాతినిథ్యం ఇస్తూ, క్యాబినెట్‌లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్‌ కూడా బీసీనే. రేపు రాబోయే మండలి అధ్యక్షుడు కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఉండే వీలుంది’.

హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ..ఏమన్నారంటే..:

సీఎం మహిళా పక్షపాతి,‘47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను ఇవాళ ప్రకటిస్తున్నాం. సీఎం మహిళా పక్షపాతి. అందుకే వారికి 52 శాతం పదవులు ఇచ్చారు. అది ఆయన గొప్పతనం:
ఇది బీసీల ప్రభుత్వంః మంత్రి వేణుగోపాలకృష్ణ

  • బీసీలను బాబు ఎప్పుడూ చులకనగానే చూశారు
  • సీఎంకు.. సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు
  • బాబు హయాంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం..
  • చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపిస్తున్న సీఎం జగన్

Latest News