ప్రభుత్వం చేసే సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారచేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే… ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుందన్నారు.
ప్రజలతో మమేకం కావడమే కాదు… ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధులు, నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులని వారి పనితీరు, వ్యవహారశైలితోనే పార్టీకి, ప్రభుత్వానికి మంచి, చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందనివ ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని ఆయన తెలిపారు.
పీక్ లోడ్ లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించామన్నారు. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పారు.
సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టామని ఆయన అన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోందన్నారు.ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తున్నామని తెలిపారు