Site icon vidhaatha

ఏపీ ఎస్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ లో పాల్గొన్న AP DGP

విధాత:దేశంలోనే ఉత్తమైన ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ గా ఏపి సేవలను అందిస్తుంది.ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభించి ఇది 4వ సంవత్సరం ప్రజల ప్రాణాలను విపత్కర పరిస్థితులలో కాపాడటానికి ఏపీ పోలీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ సిబ్బంది చక్కటి డెమో విన్యాసాన్ని ప్రదర్చించారు.AP ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ కు చెందిన 540మంది సిబ్బంది ని జాతీయ స్థాయి శిక్షణ సంస్థ ద్వారా అత్యంత ఆధునిక అడ్వాన్స్ టెక్నాలజి వినియోగంలో పూర్తి స్థాయి లో శిక్షణ పొందారు.

ఎపి లో ఆరు కంపెనీలతో కూడిన 600 మంది పోలీస్ సిబ్బందితో అత్యంత బలమైన APSDRF గా సేవలను అందిస్తుంది.మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా 12 బృందాలతో ఆరు ప్రాంతల కేంద్రంగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు మంగళగిరి, నెల్లూరు కర్నూలు సేవలను అందిస్తున్నాయి.గత రెండు సంవత్సరాలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ చాలా బలపడింది.ఏపీ ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయం తో కలిసి పని చేస్తుంది.

Exit mobile version